50 వేల కొలువులకు ఒకేసారి నోటిఫికేషన్లు!


50 వేల కొలువులకు ఒకేసారి నోటిఫికేషన్లు!
జోనల్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు
యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాం: సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌
ఆరేళ్ల పదవీ కాలం సంతృప్తినిచ్చింది: ఘంటా చక్రపాణి
టీఎస్‌పీఎస్సీ యాక్టింగ్‌ చైర్మన్‌గా కృష్ణారెడ్డి నియామకం

ఒకేసారి 50 వేల కొలువుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేష్‌ కుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పోస్టుల భర్తీని చేపడతామని ఆయన పేర్కొన్నారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంట, సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీ పదవీకాలం పూర్తయిన సందర్భంగా ప్రతిభా భవన్‌లో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో సీఎస్‌ సోమే్‌షకుమార్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఖాళీలపై రెండు రోజులుగా అనేక సమావేశాలు నిర్వహిస్తున్నామని, శాఖలవారీగా పోస్టుల వివరాలు ఇప్పటికే అందాయని చెప్పారు.*

*?‘‘50 వేల కొలువులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల మాకు ఆదేశాలు జారీ చేశారు. వేగంగా నియామకాలు చేపట్టే ఈ సమయంలో టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌, ముగ్గురు సభ్యుల పదవీకాలం పూర్తవడం బాధాకరం. కొత్త వాళ్ల నియామకం ఎప్పుడు జరుగుతుందో? వాళ్లు ఎప్పుడు వస్తారో? ఎప్పుడు పనిమొదలుపెడతారో? నాకు తెలీదు.’’ అని సీఎస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.*

*?రాష్ట్రపతి ఉత్తర్వులపై ప్రత్యేక సెల్‌!*

*?ఉద్యోగ నియామకాల్లో కొన్ని సవాళ్లు ఎదురువుతున్నాయని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ చెప్పారు. జోనల్‌ విధానంపై రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు తన కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరేళ్లలో టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా పారదర్శకంగా 35 వేల పోస్టులను భర్తీ చేయడమనేది సాధారణ విషయం కాదని మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు.*

*?యువతలో ఆనందం : జస్టిస్‌ చంద్రయ్య*

*?వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల  సీఎం కేసీఆర్‌  చేసిన ప్రకటన నిరుద్యోగ యువతలో ఆనందం నింపిందని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య పేర్కొన్నారు.  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ ఘంటా చక్రపాణితోపాటు సభ్యులు విఠల్‌, చంద్రావతి, మహమ్మద్‌ మతీనుద్దీన్‌ ఖాద్రీల వీడ్కోలు సభను ఉద్యోగ సంఘాలు  గురువారం నిర్వహించాయి.*

*?ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎంతో ఆలోచించి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సమర్థుడైన ఘంటా చక్రపాణిని ఎంపిక చేశారన్నారు. కమిషన్‌ సభ్యులు విజయవంతంగా వారి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పేదలకు చక్కటి ఇళ్లు ఇవ్వాలనప్పుడు తాను అద్భుతమై డిజైన్‌ను ఆయన దృష్ఠికి తీసుకెళ్లానని.. ఈ విషయాన్ని ఘంట చక్రపాణితోనూ చర్చించానని గుర్తు చేశారు.*

*?సీఎం ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్‌, రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ కమిషన్‌ విశ్వసనీయతను  ఘంటా చక్రపాణి పెంచారని  కొనియాడారు. చక్రపాణి మాట్లాడుతూ  తాను చెప్పినా కూడా ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వొద్దని, పూర్తి పాదర్శకంగా నియామకాలు చేపట్టాలని తనతో సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ఈ సందర్భంగా కమిషన్‌ సావనీరును, మరో మూడు గ్రంథాలను ఆవిష్కరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, దిలీప్‌, దేవీప్రసాద్‌ రావు, వాణీప్రసాద్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.*

100 మందితో 35 వేల పోస్టుల భర్తీ: ఘంటా చక్రపాణి*

*?టీఎ్‌సపీఎస్సీలో ఉన్న 100 సిబ్బందితో రికార్డు స్థాయిలో 35 వేల పోస్టులను భర్తీచేసినట్లు ఘంటా చక్రపాణి తెలిపారు. త్రిపుర, గోవా పీఎస్సీల కన్నా టీఎ్‌సపీఎస్సీకి తక్కువ సిబ్బంది ఉన్నారని ఆయన చెప్పారు. ఉద్యోగాలను త్వరగా భర్తీ చేసేందుకు కొందరు సిబ్బంది 24 గంటలు పనిచేసిన సందర్భాలున్నాయన్నారు. ఆరేళ్ల పదవీకాలం తనకు సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.*

*?ఈ వీడ్కోలు సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లంనారాయణ, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, టీఎ్‌సపీఎస్సీ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్‌, బేవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.*

About The Author