చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.


లారీ వేగంగా వచ్చి ఢీకొన్న దుర్ఘటనలో వ్యానులో ప్రయాణిస్తున్న ఓ బాలిక సహా ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు.
చిత్తూరు జిల్లా, పూతలపట్టు- నాయుడుపేట జాతీయరహదారిపై పాకాల మండలం, గాదంకి సమీపంలో శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ విస్ఫోటనంలా వినిపించడంతో పరిసర ప్రాంతాల వారు ఉలిక్కి పడ్డారు. కర్ణాటక రాష్ట్రం నంగిలికి చెందిన పి.విజయకుమార్‌, తమ్ముడు శేఖర్‌ కుటుంబం కలిసి శుక్రవారం తిరుపతిలోని పలు ఆలయాల సందర్శనకు బయల్దేరారు. వీరితోపాటు తాము నివసిస్తున్న ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం రాజు కుటుంబము ఉంది. రెండు వాహనాల్లో మొత్తం పదిమంది వెళ్లారు. దర్శనం అనంతరం నంగిలికి వెళ్తుండగా గాదంకి సమీపాన చిత్తూరు నుంచి వస్తున్న లారీ వేగంగా వీరి వ్యానును ఢీకొట్టింది. ఆ ధాటికి వ్యాను ఒక్కసారిగా అడ్డం తిరిగిపోయింది. అందులో ముందు సీట్లో ఉన్న విజయకుమార్‌ భార్య అన్నపూర్ణ(60), ఆయన తల్లి రాజమ్మ(80), వెనుక కూర్చున్న జ్యోతి(14) అక్కడికక్కడే మృతి చెందారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

About The Author