‘ఖైదీ’ నటుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకు గడ్డుకాలం అనే చెప్పవచ్చు. ఒక వైపు కరోనా వలన చాలా మంది సినీ కార్మికులు రోడ్డున పడగా, మరోవైపు లెజండరీ నటీనటులు, కొరియోగ్రాఫర్స్, దర్శకులు కన్నుమూశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదలుకొని ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, నిషికాంత్ కామత్, సరోజ్ ఖాన్, జగదీప్, రాక్‌లైన్ సుధాకర్, వడివేల్ బాలాజీ, జయప్రకాష్ రెడ్డి, చిరంజీవి సర్జా, సేతురామన్ ఇలా దాదాపు 50 మంది సెలబ్రిటీలు తుదిశ్వాస విడిచారు.తాజాగా ఖైదీ నటుడు సోమవారం రాత్రి కన్నుమూశారు. మాదక ద్రవ్యాలు ముఠాకు సహకరించే పోలీస్ అధికారిగా నటించిన అరుణ్ అలెగ్జాండర్ 48 ఏళ్ళ వయస్సులోనే మృత్యువాత పడడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి సినీ ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.అరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా తమిళ ప్రేక్షకులకి చాలా సుపరితం .మనరం’, ‘కోలమావు కోకిలా’, ‘ఖైదీ’, ‘బిగిల్’ సినిమాల్లో మంచి నటనా పటిమ కనబరచిన అరుణ్ రీసెంట్‌గా విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాలో కూడా నటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

About The Author