శేషాచలం అడవుల్లో18 ఎర్రచందనం దుంగలు 16 గొడ్డళ్లుస్వాధీనం
చిత్తూరు జిల్లా,(తిరుపతి)కరకంబాడీ రోడ్డు లోని హరిత కాలనీ వెనుక వైపు ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలతో పాటు, 16 గొడ్డళ్లు ఇతర వస్తువులను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్వో నరసింహ రావు టీమ్ సోమవారం రాత్రి నుంచి కరకంబాడీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున హరిత కాలనీ వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో అలికిడి వినిపించగా టాస్క్ ఫోర్స్ టీమ్ అక్కడకు చేరుకుంది. పోలీసులను చూసిన వెంటనే దుంగలను పడేసి, స్మగ్లర్లు పారిపోయారు. వారిని పట్టుకునే క్రమంలో వెంకటేష్, హుస్సేన్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ చాకచక్యంగా జరుడు రాళ్ళు కలిగి, వాలుగా వున్న కొండ ప్రాంతంలో స్మగ్లర్ ల యెక్క కదలికలు గమనించి స్మగ్లర్ లను పట్టుకొనే క్రమంలో జారుడు రాళ్ళలో పరుగెత్తడం వలన జారిపడి హుస్సేన్ కానిస్టేబుల్ కు నడుము భాగంలో గాయం తగిలింది. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు దాదాపు 20 మందివరకు స్మగ్లర్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా 18 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వారు వదిలి వెళ్ళిన వస్తువుల్లో 16 గొడ్డళ్లు, భక్తుని వేషంలో సంచరించే లా ఎరుపు, పసుపు దుస్తులు, టాబ్లెట్ లు, బ్యాగులు ఉన్నాయి. బ్యాగ్ లో లభించిన ఆధార్ కార్డు ప్రకారం, వీరు తమిళ నాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన వారు గా గుర్తించారు. సంఘటన స్థలానికి డీఎస్పీ వెంకటయ్య, ఆర్ ఐ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, నటరాజ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.