బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న నేపధ్యంలో తెలంగాణలో చికెన్‌ అమ్మకాలు తీవ్రంగా తగ్గాయి

హైదరాబాద్‌: దేశంలోని పలు రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న నేపధ్యంలో తెలంగాణలో చికెన్‌ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చేపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధికంగా చికెన్‌ వినియోగించే హైదరాబాద్‌ నగరంలో ఆదివారం అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ చాలా మంది మాంసం ప్రియులు ఎందుకైనా మంచిదని చికెన్‌ తినడం మానేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్‌ నగరంలో రోజుకు 6లక్షల కిలోల చికెన్‌ వినియోగం అవుతుంది. అలాగే పండగలు, ఆదివారం రోజుల్లో అయితే అది దాదాపు 8లక్షల కేజీల వరకూ ఉంటుందని వ్యాపారులు తెలిపారు.కానీ బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌ కొనే వారం సంఖ్య తగ్గుతోంది. అమ్మకాలు పడిపోతున్నాయన్న ఆందోళనలో వ్యాపారులు చికెన్‌ ధరలను కిలో 200 నుంచి 140రూపాయలకు తగ్గించారు. అయినా కొనుగోలు చేసేందుకు అధికశాతం మంది భయపడుతున్నారు. హైదరాబాద్‌ నగరానికి పక్కరాష్ర్టాలైన ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో కోళ్లను తరలిస్తుంటారు. దీంతో హైదరాబాద్‌ వాసుల్లో తెలియని భయం నెలకొంది. ఇప్పటికే మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపధ్యంలో అధికశాతం మంది వికెన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇప్పుడు బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్‌ ప్రియులు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు.మటన్‌ కొనాలంటే అధక ధర చెల్లించాలి. బర్డ్‌ఫ్లూ ప్రచారంతో తాజాగా చేపల ధరలను కూడా పెంచి అమ్ముతున్నారు. ఆదివారం చేపల ధరలు 100 నుంచి 200 రూపాయలు పెంచి అమ్మకాలు చేశారు. ఇక మటన్‌ ధర కిలో 700 రూపాయలకు అమ్ముతున్నా, వాటి శరీరంలోని మిగిలిన భాగాలు లివర్‌, బోటీ, కాళ్లు, తలకాయ వంటి వాటి ని మాత్రం అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం బర్డ్‌ఫ్లూ విషయంలో అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతోంది. ఆందోళన పడాల్సిన పని లేదని చెబుతోంది. కానీ దేశంలోని ఇతర రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న నేపధ్యంలో తెలంగాణలో మాత్రం అమ్మకాల పై ప్రభావం చూపిస్తోంది

About The Author