సీఎంగా కేటీఆర్..కేసీఆర్ మనువడు క్లారిటీ…
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్‌కు పట్టాభిషేకం హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌ను సీఎంను చేయాలనే డిమాండ్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది.
ఈ మధ్య కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు హల్‌చల్ చేచస్తున్నాయి మరి గులాబీ బాస్ మదిలో ఏముందో తెలియదు కానీ సీనియర్ మంత్రులు సైతం కేటీఆర్‌కు జై కొడుతున్నారు ఇక, ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు సందర్భం వచ్చినప్పుడల్లా కేటీఆరే సీఎం కావాలంటూ తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. తాజాగా తలసాని, నిజామాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్‌ను సీఎం చేయాలని తమ డిమాండ్‌ను తెలిపారు. అయితే.. కేటీఆర్ సీఎం కాబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాని గురించి తనకు తెలియదని ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అసలు చర్చించరని క్లారిటీ ఇచ్చాడు హిమాన్షు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో “ఆస్క్ మీ వాటేవర్ యూ ఫీల్ లైక్” అనే ట్యాగ్ లైన్‌తో నెటిజెన్లతో ముచ్చిటించారు హిమాన్షు.
ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు. కేటీఆర్, కేసీఆర్ లాగే రాజకీయాల్లోకి వస్తారా అని ఒకరు అడగ్గా తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చాడు హిమాన్షు. అలాగే కేటీఆర్ పట్టాభిషేకంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అసలు చర్చించరని కుండ బద్దలు కొట్టేశాడు హిమాన్షు.