మినీ ట్రక్కు వాహనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు


ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లాకు మంజూరైన మినీ ట్రక్కులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ సరఫరా చేసేందుకు జిల్లాకు 754 మినీ ట్రక్ వాహనాలను కేటాయించారని, ఈనెల 21 న గురువారం ఉదయం కార్యక్రమం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి తిరిగి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులను వారి ఇంటి దగ్గరికి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తోందని, ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ ఎలాగైతే లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్లి ఇస్తున్నారో అలాగే సరుకులను కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ నాణ్యమైన బియ్యం ఇంటింటికీ సరఫరా చేసే మినీ ట్రక్కులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ ,రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ హరిప్రసాద్, ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి వివిఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

——————————————————
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ…

About The Author