మసాజ్ చేస్తుండగా మహిళ వీడియో రికార్డ్ … కోరికలు తీర్చాలంటూ బ్లాక్ మెయిల్.
మహారాష్ట్ర … పుణ్ … ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుంటే … బిజినెస్‌లు జోరందుకుంటున్న సమయం . ఓ మార్కెట్ యార్డులో క్లాస్ గా ఉంది ఆ ఆయుర్వేద మసాజ్ పార్లర్ . తోటి వారి లాగే ఆ మహిళా జాబ్ చేస్తోంది . వచ్చిన కస్టమర్లకు మసాజ్ చేయడం ఆమె డ్యూటీ . అక్కడకు వచ్చిన ఓ కస్టమర్ . కాసేపు ఆమెవైపు అదోలా చూశాడు . వెంటనే తన మొబైల్ బయటకు తీశాడు . అందులో ఓ ప్రత్యేక యాప్ ఉంది . దాన్ని తెరిచాడు . మొబైల్ కెమెరాను ఆన్ చేశాడు . ఆ యాప్ కారణంగా … కెమెరా ఆన్‌లో ఉన్నా , వీడియో రికార్డ్ అవుతున్నా … ఆ విషయం బయటకు తెలియదు . జనరల్ గా డిటెక్టివ్ లు తమ పరిశోధన కోసం అలాంటి యాప్స్ వాడుతుంటారు . ఇక్కడ ఆ కస్టమర్ … మొబైల్ కెమెరా వీడియో ఆన్ చేశాడు . రికార్డు చేయసాగాడు .
ఇవేవీ తెలియని ఆమె … సార్ … రండి అని పిలిచింది . ఇక్కడ పడుకోండి అంటే … పడుకున్నాడు . ఓవైపు ఆమె మసాజ్ చేస్తుంటే … మరోవైపు తన మొబైల్ లో ఏవో న్యూస్ చూసుకుంటున్నట్లు బిల్డప్ ఇచ్చాడు . కానీ అతను చేస్తున్నది వీడియో రికార్డ్ . అది తెలియని ఆమె … అటూ ఇటూ కదులుతూ … మొత్తానికి మసాజ్ పూర్తి చేసింది . ఆమెను రకరకాల కోణాల్లో వీడియో తీశాడు . ఆ తర్వాత అంతా అయిపోయాక … హాయిగా వెళ్లిపోయాడు . ఆమె తన పనిలో నిమగ్నమైపోయింది . రెండ్రోజుల తర్వాత … ఆమెకు కొత్త మొబైల్ నంబర్ తో కాల్ చేశాడు . ” నిన్ను నగ్నంగా వీడియో తీశాను ” అన్నాడు . ఆమె షాకైంది . నమ్మలేదు . వెంటనే ఆమె వాట్సాప్ నంబర్ కు ఓ చిన్న వీడియో క్లిప్ పంపాడు . అందులో ఆమె మసాజ్ చేస్తున్నప్పుడు అటూ ఇటూ వంగిన దృశ్యాలున్నాయి . షాకైంది . తనకు తెలియకుండా … తనను అలా ఎలా వీడియో తీశాడని ఆశ్చర్యపోయింది . 5 నిమిషాల తర్వాత మళ్లీ కాల్ చేసి … ” నేను చెప్పినట్లు వినాలి . నేను చెప్పిన చోటికి రావాలి . నాతో గడపాలి . ఈ విషయం ఎవరికైనా చెప్పావో … నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతా ” అని బెదిరించాడు . ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు . చలి జ్వరం వచ్చినట్లు ఓ మూల కూలబడింది . ఆ రోజు డ్యూటీ చేసిందే గానీ మనసంతా ఆందోళనే .
తనకు బాగా క్లోజ్ అయిన ఓ తోటి ఉద్యోగినికి జరిగింది చెప్పింది . ఆమె చాలా మంచిది . ” ఎవడాడు … దొంగ …. అలాంటోళ్లని వదలొద్దు . నువ్వేం ఆలోచించకు … తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి … జరిగింది చెప్పు . నీకు పంపిన వీడియోని చూపించు . ఆళ్లు పట్టుకుంటారు . అని ధైర్యం చెప్పింది . దాంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది . కేసు రాసిన పోలీసులకు పక్కా ఆధారాలు ఉండటంతో … ఈజీగా సురేష్ అదిక ను పట్టుకున్నారు . అతగాడు ఓ ఇంజినీరింగ్ వర్క్ షాపులో పనిచేస్తుండగా … ” చేసింది చాలు … నీకు చేయాల్సింది చాలా ఉంది పదరా ” అంటూ లాక్కుపోయారు . కట్ చేస్తే మేజిస్ట్రియల్ కోర్టులో ప్రవేశం . కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది . ఇప్పుడు పోలీసుల వంతు . అతను ఇంకా ఎంత మందిని ఇలా వేధించాడో , ఎంత మందిని వీడియో తీశాడో తెలుసుకునేందుకు ముంబై నుంచి స్పెషల్ లాఠీలను తెప్పిస్తున్నారు .