రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలసిన మాజీమంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర..


ఫ్లాష్ ఫ్లాష్
మచిలీపట్నం కార్పొరేషన్ లోకి విలీనం చేసిన 9 గ్రామ పంచాయతీ లకు కార్పొరేషన్ లోకి కలిపి ఎన్నికలు నిర్వహించాలి…

రిజర్వేషన్లు తారుమారుచేస్తు మునిసిపల్ డివిషన్ ఓటర్లిస్టులు తయారుపై వెంటనే చర్యలు తీసుకోని మచిలీపట్నం మునిసిపాల్ కార్పొరేషన్ ఓటర్లు జాబితా సరిచేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరిన కొల్లు రవీంద్ర..

కొల్లు రవీంద్ర తో పాటు 9 గ్రామాల ప్రజలు, మాజీ మునిసిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్, మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, మండల పార్టీ అధ్యక్షుడు కుంచె దుర్గా ప్రసాద్, దిలీప్, పిప్పళ్ల కాంతారావు, గోకుల్ శివ, తిరుమని నారాయణ, సురేష్, వనరాజు, వీర్రాజు, అమ్మిరెడ్డి శివాలు ఎన్నికల సంఘాన్ని కలిశారు.

కొల్లు రవీంద్ర కామెంట్స్…
————————————–
మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ని 9 గ్రామ పంచాయతీ లను మునిసిపల్ గెజిట్ నోటిఫై చేసి కార్పొరేషన్లోకి విలీనం చేసిన ప్రభుత్వం.. ఎన్నికల నోటిఫికేషన్ లో మాత్రం ఆ గ్రామాలను ఏ డివిషన్ లోకి కలపకుండా అసలు వాటికి ఎన్నికలే లేకుండా చేసింది.

గ్రామపంచాయతీ నోటిఫికేషన్ లో కూడా ఆ గ్రామము లకు ఎన్నికలు పెట్టలేదు.. దీనిపై గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ న్యాయస్థానం ను ఆశ్రయించం. కోర్ట్ విచారించి రీనోటిఫికేషన్ ఇస్తే వీరిని మునిసిపాలిటీ లో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

అదే విషయాన్ని ఈ రోజు మరోసారి ఎన్నికల సంగం దృష్టికి తీసుకురావడం జరిగింది.. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును లేకుండా చేసేందుకు ఎవరికి అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వలన 9 గ్రామాల ప్రజలు ఓటుహక్కు కోల్పోవాల్సి వస్తోంది.. అయినప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా చేస్తుంది. దీనిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో బందరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిషన్ లను ఒక శాస్త్రీయత లేకుండా ఇష్టానుసారంగా విభజించి, రిజర్వేషన్లు తారుమారు చేసి లబ్ధిపొందలని చూస్తున్నారు.

డివిషన్ పరిధిలోని ఓట్లను ఇష్టానుసారంగా తొలిగించడం, ఒక డివిసిన్ ఓటర్లను వేరే డివిషన్ లోకి మార్చడం. ఒక దివిషన్ కు 4000 ఓట్లు ఇంకో డివిషన్ కు 1500 ఇలా ఇస్తానుసారంగా రాజకీయ వత్తిడులకు లొంగి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా డివిజన్ ఓటర్ జాబితా లు ఉన్నాయి వీటినికుడా ఎన్నికల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ఎన్నికల సంగం దీనిపై విచారించి.. 9 గ్రామాలను కార్పొరేషన్ లో కలిపి నోటిఫికేషన్ తో పాటుగా డివిషన్ వారి ఓట్ల విభజనలో జరిగిన తప్పులను సరిచేసి రిజర్వేషన్లు కాపాడలని కోరడం జరిగింది.

దీనిపై స్పందించిన ఎన్నికల సంగం వెంటనే కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు.. ఎన్నికల సంగం న్యాయం చేస్తారనే విశ్వాసం మాకుంది..

అని కొల్లు రవీంద్ర మీడియాకు తెలిపారు..

About The Author