తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం జరిగింది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర సభ్యులతో పాటుగానే ప్రమాణ స్వీకారం చేయడానికి వీలుగా అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకం జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సాధారణంగా నామినేటెడ్ సభ్యుడి నియామకంలో జాప్యం జరుగుతుంది. దీనివల్ల నామినేటెడ్ మెంబర్ ఇతర సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం సాధ్యపడదు. ఫలితంగా విలువైన పదవీ కాలాన్ని కోల్పోతారు. ఈ సమస్యను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం తన మొదటి కేబినెట్ సమావేశంలోనే అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకానికి నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో గంగా జమునా తహజీబ్ ను కొనసాగించడానికి ప్రభుత్వం అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రొటెమ్ స్పీకర్ గా ముస్లిం వర్గానికి చెందిన శ్రీ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను నియమించింది. అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ శ్రీ ఎల్విస్ స్టీఫెన్ సన్ ను నియమించాలని సోమవారం జరిగిన కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే గెజిట్ విడుదల అవుతుంది.

చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ నిబంధన మేరకు తెలంగాణ అసెంబ్లీలో ఈ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2018 డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని మంత్రివర్గ సమావేశం అభినందించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది.

సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనల ప్రతులు
——————————————————–
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులకు భారత రాజ్యాంగం ప్రతులను, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అసెంబ్లీకి సంబంధించిన వివిధ నిబంధనల పుస్తకాలను, బుక్ లెట్లను, ఇతర సమాచారాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సబంధించిన ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి శ్రీ వేదాంతం నర్సింహచార్యులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి చూపించారు.

ENGLISH…

The State Cabinet presided over by Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao met on Monday at Pragathi Bhavan.

The Cabinet has decided to nominate Anglo-Indian community representative to enable him to take oath along with other elected MLAs which never happened in the history of Assembly earlier. Normally there would be a lot of delay in nominating the Anglo-Indian representative and this results in his not taking oath along with other elected members. This would also result in the loss of precious time to work as an MLA. To avoid this the Telangana Cabinet in its first meeting itself has taken a decision on the nomination of Anglo-Indian Community representative.

The Telangana government with reference to the matters concerned the Legislative Assembly is taking decisions continuing the Ganga-Jamuna Tehzeeb. Sri Mumtaz Ahmed Khan of a Muslim community is nominated as Pro-tem speaker. The Cabinet on Monday decided to nominate Sri Elvis Stephenson as nominated Member of the House. Proposal to this effect has been forwarded to the Governor and on his consent Gazette notification will be issued. The Cabinet has taken this decision in accordance with the provisions of the Constitution of India to provide representation for Anglo-Indian Community in the Telangana State Assembly.

The Cabinet has placed on record its deep appreciation to the Election Commission of India in general and The Chief Electoral Officer Sri Rajat Kumar for the successful and peaceful conduct of State Assembly Elections. The Cabinet has also placed on record its appreciation to the Election machinery.

The Government has decided to provide copies of the constitution of India, assembly procedures, booklets and other information connected to the Legislature procedure in Telugu, English and Urdu languages to all the MLAs. Copies of this were shown to the Hon’ble Chief Minister by Legislature Secretary Sri Vedantam Narsimha Charyulu in Pragathi Bhavan on Monday.