స్మగ్లరపై ఉక్కుపాదం మోపాలని…ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కలప స్మగ్లింగ్ కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. పోలీసుల సహకారంతో కలప స్మగ్లరపై ఉక్కుపాదం మోపాలని, తరచూ స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై పి.డి. యాక్టు నమోదు చేయాలని చెప్పారు. కలప స్మగ్లర్లు ఎంతటి వారైనా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తయినా, ఏ రాజకీయ పార్టీకి చెందినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను నాలుగు విభాగాలుగా విభజించుకుని చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కల పెంపకం, అడవి పునరుద్ధరణ, హైదరాబాద్ నగరంలోపలా బయటా పచ్చదనం పెంచడం, కలప స్మగ్లింగ్ అరికట్టడంపై కార్యాచరణ రూపొందించుకుని రంగంలోకి దిగాలని సీఎం సూచించారు.

పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సలహాదారు శ్రీ అనురాగ్ శర్మ, సిఎస్ శ్రీ ఎస్.కె. జోషి, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, పిసిసిఎఫ్ శ్రీ పి.కె.ఝా, సీనియర్ అధికారులు శ్రీ ఎస్.నర్సింగ్ రావు, శ్రీ రామకృష్ణ రావు, శ్రీ రాజీవ్ త్రివేది, శ్రీ నిరంజన్ రావు, శ్రీమతి స్మితా సభర్వాల్, శ్రీ రాజశేఖర్ రెడ్డి, శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీమతి ప్రియాంక వర్గీస్, పలువురు అటవీశాఖ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

‘‘అడవుల్లో సహజంగా చెట్లు పెరుగుతాయి. అడవుల ద్వారా లభించే పచ్చదనమే ఎక్కువ. ఓ వైపు అడవులు నశించిపోతుంటే, హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా ఎన్ని చెట్లు పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అడవులను కాపాడితే పచ్చదనం కాపాడినట్లే. అడవులను కాపాడడమంటే, భూమి ధర్మాన్ని కాపాడినట్లే. కలప స్మగ్లింగ్ వల్ల అడవులకు పెద్ద ముప్పు వాటిల్లుతుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నది. కొందరు కలప స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రాంతాలను, వ్యక్తులను గుర్తించాలి. అక్కడ నిబద్ధత కలిగిన అధికారులను నియమించాలి. కలప స్మగ్లింగ్ అరికట్టడమే లక్ష్యంగా వారు పనిచేయాలి. పోలీసుల సహకారంతో అటవీశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించాలి. సాయుధ పోలీసుల అండతో కలప స్మగ్లింగ్ ను నూటికి నూరు శాతం అరికట్టాలి. కలప స్మగ్లింగుకు పాల్పడే వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దు. కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి సహకరించే అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు ఎవరైనా స్మగ్లింగ్ కు పాల్పడినా వదిలిపెట్టవద్దు, టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఈ పనిచేస్తే ముందు వారిపైనే చర్యలు తీసుకోండి. గతంలో నక్సలైట్ల కారణంగా అడవుల్లోకి వెళ్లడం సాధ్యం కావట్లేదు అని సాకులు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి సమస్య కూడా లేదు. అడవులను కాపాడడమే లక్ష్యంగా పనిచేయండి. పోలీస్, అటవీ అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఇండ్లు నిర్మించుకునే సందర్భంలో తాము ఎంత కావాలంటే అంత కలప అందిస్తామని కొందరు అధికారులు తరచూ చెపుతుంటారని సీఎం చెప్పారు. అడవుల్లో చెట్లు నరకడం వల్లే ఈ కలప సమకూరుతున్నదని, ఇలాంటి అక్రమాన్ని అరికట్టాలని సూచించారు. కట్టె కోత మిషన్ల (సామిల్స్) నిర్వహణపై కూడా నియంత్రణ ఉండాలని, కొత్తగా ఎలాంటి సామిల్స్ కు అనుమతి ఇవ్వవద్దన్నారు. అడవులను రక్షించడంతో పాటు, చెట్ల నరకివేత వల్ల పోయిన అడవిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రూట్ స్టాక్ ను ఉపయోగించుకుని అడవుల పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. సామాజిక అడవుల అభివృద్ది కన్నా, అటవీ ప్రాంతంలో అడవి పెంచడం సులువు, ఎక్కువ ఉపయోగం అని సీఎం అన్నారు.

‘‘తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద ప్రతీ ఏటా నాటే మొక్కల సంఖ్యను పెంచాలి. వచ్చే వర్షాకాలం నుంచి ఏడాదికి వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలి. దీనికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘హైదరాబాద్ నగరం పరిధిలో లక్షా 50 వేల ఎకరాల అటవీ బ్లాకులున్నాయి. కానీ అందులో చెట్లులేవు. ఈ అటవీ బ్లాకుల్లో పెద్ద ఎత్తున చెట్లు పెంచాలి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రస్తుతం విపరీతమైన వాయు కాలుష్యం ఉంది. చెట్లు లేకపోవడం, వాహన కాలుష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో కూడా వాహనాల సంఖ్య పెరుగుతోంది. కాలుష్యం పెరుగుతోంది. దీన్ని నివారించాలంటే చెట్లు పెంచడం ఒక్కటే మార్గం. అన్ని పార్కులు, అటవీ బ్లాకుల్లో విరివిగా చెట్లు పెంచాలి. వాటిలో వాకింగ్ పాతులు కూడా నిర్మించి ఉపయోగంలోకి తేవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

చెట్ల పెంపకం కార్యక్రమానికి నిధుల కొరత లేదని సీఎం అన్నారు. కాంపా నిధులు, నరేగా నిధులు, బడ్జెట్ నిధులు, నగర పాలక సంస్థల ద్వారా వచ్చే నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. పచ్చదనం పెంచడానికి తీసుకునే చర్యలకు నిధుల కొరత ఉండదని, చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం కోరారు.

ENGLISH

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao said, that, under any circumstances the wood smuggling in Telangana State forests area shall be brought down to Zero. The CM instructed the forest officials to take support from the police and with iron hand, the PD Act should be revoked wherever necessary on smugglers who frequently indulge in smuggling forests wood. CM also instructed that however influenced might be the wood smugglers and what ever political party they belong action should be initiated against them. He said, that, the state shall be divided into four parts and action plan should be drawn for environmental protection. The CM suggested that an action plan should be evolved on crores of plantation of saplings throughout state, forest rejuvenation, greenery development in and around Hyderabad city and control of wood smuggling.

CM held a review meeting on Environment protection and development of forest area on Monday in Pragathi Bhavan. Home Minister Sri Mahamood Ali, Chief Advisor to Government Sri Rajiv Sharma, Advisor Sri Anurag Sharma, Chief Secretary Sri SK. Joshi, DGP Sri Mahender Reddy, PCCF Sri SK. Jha, Senior officers Sri S. Narsing Rao, Sri Rama Krishna Rao, Sri Rajiv Trivedi, Sri Niranjan Rao, Ms. Smita Sabarwal, Sri Rajashekhar Reddy, Sri Bhoopal Reddy, Ms. Prinyanka Verghese and Senior Police and Forest officials participated in the meeting.

“Trees are grown naturally in the forest areas. The maximum greenery is available through forest only. If these forests disappear slowly there is no use in taking up programmes like Haritha Haram. Protection of forests means protection of greenery. Due to forest wood smuggling, the forests face lot of problems in some parts of the state forest areas the wood smuggling is rampant. For some people wood smuggling has become a profession. Such of these people and the areas where they involve in smuggling are to be identified. There committed forest officials should be deployed. By taking the help of police, forest officials should develop an action plan. Taking the support of armed police teams smuggling should be brought down to Zero. Who ever is indulged in wood smuggling shall not be tolerated. Stringent action shall be initiated against them. If any officer of the department who supports smuggling shall be identified and action should be taken against them. Any political leader from any party if indulges in wood smuggling should not be left out without action. If any TRS leader indulge in wood smuggling action should be taken against them also. Earlier on the pretext that due to Naxalites the officials were unable to go deep into the forests and now there is no such problem. Let the officers work with the commitment with the objective to protect forests. Police and forest officials should hold a joint meeting and develop an action plan to control smuggling” said the CM.

CM said, that, forest officials frequently confess that they would provide any quantity of wood to certain influential people when they construct their houses. He said that this is possible due to illegal felling of the forests and such an activity should be done away. He also said that the management of saw mills also regularised and no fresh licences to be issued to new saw mills. The CM suggested that along with forest protection rejuvenation of forests to substitute the loss due to forest felling should also be taken up. Root stock should be made use of while rejuvenating the forests. He said that more than the social forestry it is easier to develop forests in forest area.

“The number of saplings to be planted as part of Telangana ku Haritha Haram should be increased year after year. During the next monsoon 100 Crore of saplings should be planted. Action plan for this should be developed “said the CM.

“In Hyderabad Metropolitan Development Area 1,50,000 acres of forests blocks. However, there is no forests in that. In these blocks large scale plantation should be done. In the country capital New Delhi there is lot of air pollution which is due to lack of trees and due to vehicle pollution. In Hyderabad also, the number of vehicles is increasing day by day. Correspondingly the pollution is also increasing to avoid this the only solution is growing trees, every park and every forest block massive plantation should take place. Around Hyderabad by the end of next three years there shall be a feeling to the people that they are living in a forest area. Form as many walking clubs as possible” said the CM.

The CM said, that, there is no dearth of funds and funds can be drawn from CAMPA MGNREGA, budgetary provision and funds from municipalities.