కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్


కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ప్రధాన గేట్ తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట ఆర్ అండ్ బి శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి శ్రీ సునిల్ శర్మ, ఇ.ఎన్.సి శ్రీ గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులున్నారు.

Chief Minister Sri K. Chandrashekar Rao visited and inspected the progress of construction works of New Secretariat Building on Tuesday. The CM went around and visited every nook and corner and interacted with the engineers on the site and representatives of working agency. The CM instructed them to speed up the works and to ask them to maintain the highest quality standards in construction. The CM visited the construction sites of the Main Entrance, other gates and main building complex. The CM examined the designs.

Ministers Sri Vemula Prashanth Reddy, Sri Mohammod Ali, Sri Talasani Srinivas Yadav, Sri Koppula Eshwar, Government’s Chief Advisor Sri Rajiv Sharma, Chief Secretary Sri Somesh Kumar, R&B Principal Secretary Sri Sunil Sharma, E-n-C Sri Ganapathi Reddy, Rythu Bandhu Samithi President Sri Palla Rajeshwar Reddy, MLA Sri Muthireddy Yadagiri Reddy accompanied the Chief Minister.

About The Author