బైక్ 60 వేలు.. ఫైన్ 1 లక్ష 30 వేలు..బైక్ పోలీసు స్టేషన్ లో పెట్టేసి , దండంపెట్టి వచ్చాడు..
బైక్ ధర 60 వేలు.. ఫైన్ 1 లక్ష 30 వేలు.. పాపం ప్రకాష్ రాజ్ వాటర్ క్యాన్ లు ఇంటింటికి తిరిగి వేస్తుంటాడు. ఫైనాన్స్ పై బైక్ తీసుకొని ఇంటింటికి వాటర్ క్యాన్ లు వేస్తున్నాడు.వారం క్రితం పోలీసులు పట్టుకొని వరసపెట్టి ఫైన్ మీద ఫైన్ వేసి మొత్తం లక్ష ముప్పై వేలు కట్టమని రశీదు చేతికిచ్చారు. ఆ పేదవాడు నెత్తీ నోరుకొట్టుకుంటున్నాడు. ఇంతకీ ఫైన్ వివరాలేమిటో చూడండి. కొత్త బైక్ రిజిస్ట్రేషన్ లేకుండా రోడ్డుమీదకు వచ్చినదానికి 1 లక్ష 17 వేల రూపాయలు ఫైన్ వేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని 5 వేలు , బైక్ డాక్యుమెంట్లు లేవని 5 వేలు , ఇన్స్యూరెన్స్ కాగితాలు లేవని 3 వేలు … ఇలా చేతిలో పెన్ను , రశీదు పుస్తకం ఉందికదా అని ఎడాపెడా రాసేశారు. ఇప్పుడు వాడేమి చెయ్యాలి..? అందుకే బైక్ తీసుకుపోయి పోలీసు స్టేషన్ లో పెట్టేసి , దండంపెట్టి వచ్చాడు.. ఒరిస్సాలోని లోని , రాయగఢ్ లో జరిగిందిది . కొత్త కేంద్ర చట్టం ప్రకారమే తాము ఈ ఫైన్ వేసినట్టు పోలీసులు చెప్పారు.