దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం…


తమ జోన్ పరిధిలో మొత్తం 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసేందుకు సిద్ధం…

ఆ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతపడతాయని, ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ స్టేషన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది. డివిజన్ల వారీగా చూస్తే సికింద్రాబాద్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, గుంతకల్ పరిధిలో-3, నాందేడ్ పరిధిలో-1, గుంటూరులో-4, హైదరాబాద్ పరిధిలో-7, స్టేషన్లను మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

ఉన్నట్టుండి 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

About The Author