అన్ని రంగాల్లో తెలంగాణ స్వావలంబన..!


ఐటీ అధికారుల‌ దత్తత గ్రామం గొంగులూరులో‌ గాంధీ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఐటీ చీఫ్ ప్రిన్సపల్ కమిషనర్‌ ఆఫ్ ఎపీ & తెలంగాణ శ్రీ మహాపాత్ర గారు, ఇతర ఐటీ అధికారులు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు, ఎంపీ బీబీ పాటిల్ గారు, కలెక్టర్ హనుమంతరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
– ఐటీ అధికారులు అంటే పన్నులు వేసే వారు అనుకుంటాం.
– కానీ, ఈ అధికారులు‌ గొంగులూరు అభివృద్ధికి శ్రమదానంతో పాటు, తమ సొంత జీతాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
– పెద్ద చెరువును మినీ‌ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతున్నారు.
– గ్రామం అభివృద్ధి కావాలంటే గ్రామస్థుల సహకారం అవసరం.
– ఐటీ‌ అధికారుల‌ సహకారంతో మంజీర సబ్బులు, మంజీర సర్ఫ్ తయారు‌చేయడం అభినందనీయం.
– పప్పుల తయారీ గిర్నీని మహిళాసంఘాలకు నా వంతుగా అందజేస్తాం. మంజీర పేరుతో‌నాణ్యమైన పప్పులు అమ్మండి.
అంతకుముందు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో కలిసిన ఐటీ‌ అధికారులను సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఇన్ కమ్ ట్యాక్స్,‌ ఐ.ఆర్.ఎస్ అధికారులను కలిసి అభినందించడం జరిగింది. నిరంతరం విధుల్లో తీరిక లేకుండా గడిపే ఐటీ‌ అధికారులు సామాజిక బాధ్యతగా గొంగ్లూరును దత్తత తీసుకుని ప్రజల‌కోసం‌ పని చేయడం అభినందనీయం. అనంతరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పై, మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ, రైతు బంధు, రుణ మాఫీ, రైతు బీమా, మార్కెటింగ్ సదుపాయాల కల్పన పై ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరించడం జరిగింది. ప్రపంచంలో నే అతి పెద్ద‌ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ నైపుణ్యాన్ని, ఆ ప్రాజెక్టు వల్ల సాధించిన విజయాలను వారితో పంచుకోవడం జరిగింది. సిద్దిపేట అభివృద్ధిని వారు ఆసక్తి గా అడిగి ‌తెలుసుకోగా, అభివృద్ధి జరిగిన తీరును నేరుగా వచ్చి చూస్తామన్నారు. దానికి స్పందిస్తూ వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

About The Author