టీమిండియా బౌలర్ జీవితంతో ఆడుకుంటున్న భార్య
టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ ప్రత్యర్థి జట్లను ఓ ఆట ఆడుకోవడం చూశాం. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే షమీ వైవాహిక జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాడు. షమీ జీవితంతో ఆయన భార్య హసీన్ జహాన్ ఓ ఆట ఆడుకుంటోంది. 2018లో షమీ, హసీన్ జహాన్ మధ్య వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడం, అవి కాస్త వీధికెక్కేలా చేశాయి.
దీంతో దంపతులిద్దరూ గత రెండుమూడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. కానీ కూతురు ఐరా అంటే షమీకి విపరీతమైన ఇష్టం. కూతురిపై తండ్రి ప్రేమను బలహీనంగా తీసుకున్న హసీన్ జహాన్… భర్తను మానసికంగా వేధించడానికి అదే ఓ ఆయుధంగా భావించింది. ఐరా కోసం అప్పుడప్పుడు జహాన్ ఇంటికి వెళుతుంటాడు.
అయితే తనకు భర్తగా ఇవ్వని ప్రేమ, కూతురుకు మాత్రం ఎందుకని ఆమె భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐరాను భర్తకు దూరం చేసే పన్నాగానికి హసీన్ జహాన్ తెరలేపారు. కూతురికి సంబంధించి భర్త ఉనికే లేకుండా చేసే క్రమంలో ఆమె చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు ఐరా ఫొటోను షేర్ చేసింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ఫొటోలో ఐరా పేరుకు షమీ ఇంటిపేరు తొలగించి ‘ఐరా జహాన్’ అంటూ క్యాప్షన్ జతచేసింది. దీంతో షమీకి కూతురిని దూరం చేసేందుకు జహాన్ పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య పంతాలు, పగలు చివరికి కూతురిని కూడా కాకుండా చేసే వరకు వెళుతున్నాయి.