చిక్కుడుకాయ పచ్చడి..


చిక్కుడుకాయ పచ్చడి ఒక kg కాయలకి కొలతలు…

ఉప్పు,కారం,చింతపండు 150 గ్రాముల చొప్పున,
ఆవపిండి 100 గ్రా,మెంతిపింది 50 గ్రా,
వెల్లుల్లి 100 గ్రా… వేరుశెనగనూనె అరకేజీ…

చిన్న చిక్కుళ్ళు,గట్టిగింజ ఉన్నవి తీసుకుని, వాటిని ఆయిల్ లో వేపుకోవాలి. మరీ కరకర కాకుండా లైట్ గా వేపుకోవాలి.

చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు,కారం,ఆవపిండి,మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పేస్ట్ కొంచం వేసి కలిపి… చిక్కుడుకాయలు వేపగా మిగిలిన నూనెలో ఇంగువ,పప్పులతో పోపు వేసుకుని కలుపుకుని ఒకరోజు తర్వాత తినాలి.

వారం,పది రోజులు ఉంటుంది. కొంచమే పెట్టుకుంటే మంచిది. ఎక్కువ నిల్వ ఉన్నా తినలేము.

About The Author