గరుడ వారధి స్తంభాలకు ‘చిత్ర కళా’ సొబగులు


తిరుపతి నగరానికి మణిహారం కానున్న గరుడ వారధి నిర్మాణంలో ప్రత్యేకతలు ఉండేలా నగరపాలకసంస్థ కమిషనర్ , స్మార్ట్ సిటీ ఎం.డి. గిరీష గారు పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగానే గరుడ వారధి స్తంభాల పై ప్రత్యేక దృష్టి సారించారు. స్థంబాలపై చిత్ర కళలు ఉట్టిపడేలా పలు రకాల చిత్రాలను చిత్రిస్తున్నారు. అందులో భాగంగానే బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్కు ఎదురుగా ఒక స్తంభానికి చిత్రాలను వేశారు. ఈ చిత్రాలు నగరప్రజలతో పాటు శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. అన్ని స్తంభాలపై ఇలాంటి చిత్రాలను చిత్రిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కలంకారీ కళాకారుడు అంతర్జాతీయ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ నిరంజన్ మాట్లాడుతూ గరుడ వారధి సుందరీకరణ నకు శ్రీకాళహస్తి కలంకారీ మరియు ప్రాంతీయ కలలు ఉపయోగించి డిజైన్ చేయుట కొరకు అవకాశం కల్పించిన తిరుపతి నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ ఎమ్.డి. గిరీష గారికి ప్రముఖ కలంకారీ కళాకారుడు అంతర్జాతీయ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ నిరంజన్ హృదయపూర్వక వందనాలు తెలుపుచు దేశ నలుమూలల నుంచి తిరుపతి నగరంలో సందర్శించు భక్తులకు తిరుపతి మరియు తిరుమల యొక్క చరిత్ర వాటి యొక్క ప్రాశస్త్యము తెలుగు విధంగా డిజైనింగ్ చేయడం జరుగుతుందని, అంతేకాకుండా తిరుపతి నగర ప్రముఖులు, విద్యావంతులు సలహాలు మరియు సూచనలను స్వీకరించు జరుగుతుందని, ఇప్పటికే తాను చేసిన సుందరీకరణ ప్రదేశములు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి రైల్వే స్టేషన్, అనంతపూర్, ధర్మవరం, మంగళగిరి మరియు గుంతకల్ రైల్వే స్టేషన్, ముంబై జివికె అంతర్జాతీయ విమానాశ్రయం, నాగపూర్ మహా మెట్రో ప్రదేశములు దేశ విదేశ ప్రజల యొక్క మన్ననలను పొందుతున్నారని ఈ సందర్భంగా నిరంజన్ తెలియజేశాడు.

 

About The Author