ప్రాణం తీసిన అనుమానం..! అనాధలైన ముగ్గురు చిన్నారులు
చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలోని బీసి కాలనీలో హృదయ విధారక ఘటన
?ప్రేమించుకున్నారు.ప్రేమను జయించి కులాంతర వివాహం చేసుకున్నారు.వీరి అన్యోన్య దాంపత్యానికి సాక్ష్యంగా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
ఎంతో సంతోషంగా సాగాల్సిన వీరి జీవితంలో అనుమానం పెనుభూతంగా మారింది.
?భర్త భార్యపై అనుమానంతో గొంతుకోసి హతమార్చిన హృదయ విధారక ఘటన చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
?సూరిబాబు వృత్తిరిత్యా టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.2007
లో సుహాసిని ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు.
భార్య పైఅనుమానంతో సూరిబాబు తరచు గొడవ పడుతుఉండేవాడు.
?ఈ క్రమంలో మనస్పర్ధలతో వీరిద్ధరు గత రెండేళ్ళుగా విడిపోయారు.అయితే కుటుంబ పెద్ధలు సర్ధిచెప్పడంతో గత ఆరునెలలు గా కలిసి ఉన్నారు.ఈనేపద్యంలో సూరిబాబు
ఇంటి వద్ధ ఉన్న తన భార్యను అనుమానంతో చాకుతో గొంతు కోసి హత్యచేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
?ఈఘటనలో
తీవ్రరక్త స్రావంతో సుహాసిని అక్కడికక్కడే మరణించిందని కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సుహాసిని మరణానికి కారణమైన సూరిబాబును కఠినంగా శిక్షించాలంటూ బంధువులు పోలీస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.