ప్రధాని ప్రస్తావించిన రాజప్పన్ కి సహయాలు వెల్లువ…
కొట్టాయం: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ లో ప్రస్తావించిన కేరళ కొట్టాయం వాసి రాజప్పన్ కి దేశం నలువైపులనుంచి అభినందనల వెల్లువెత్తుతున్నాయి.అతనికి సహాయం చెయ్యడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు.
రాజప్పన్ కి పోలియో వల్ల రెండు కాళ్ళు సచ్చుబడి పోయినప్పటికీ, వెంబనాడ్ సరస్సులో ప్రతి రోజు నాటు పడవలో తిరుగుతూ సరస్సులో విసిరేసిన ఖాళీ సీసాలను సేకరించి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అతను చేస్తున్న ఈ పనివల్ల వెంబనాడ్ సరస్సు ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని,రాజప్పన్ ఎంతో గొప్ప పని చేస్తున్నాడని,ఎంతో మందికి అతను గొప్ప రోల్ మోడల్ అని ప్రధాని మన్ కి బాత్ ప్రశంసించిన విషయం విదితమే…
ప్రధాని ప్రస్తావనతో అతని గురించి తెలుసుకున్న చాలా మంది అతను ఇల్లు కట్టుకునేదానికి సహాయం చేస్తానని ముందుకు వస్తున్నారు.వారి తో పాటు కేరళ బిజెపి రాష్ట్ర ప్రతినిధి పిఆర్ శివశంకరన్ ఎన్నారై శ్రీకుమార్ సహాయంతో ఇంజిన్తో కూడిన ఫైబర్గ్లాస్ పడవను రాజప్పన్కు అందజేశారు.
రాజప్పన్ మాట్లాడుతూ నా పేరు ప్రధాని ప్రస్తావనతో నా గురించి తెలుసుకున్న చాలా మంది నాకు సహాయం చేస్తానని నా దగ్గరకి వస్తున్నారని చాలా సంతోషంగా ఉందని, నాకు సహాయం చెయ్యడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంటూ,నేను చేస్తున్న ఈ పనిలో నాకు ఎంతో ఆత్మతృప్తి లభిస్తోందన్నారు.