యూటర్న్ తీసుకుని వచ్చి మరీ మంత్రి పరామర్శ
రోడ్డుపక్కన ఎండలో అచేతనంగా పడి ఉన్న ఓ మహిళను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరామర్శించి వివరాలు ఆరా తీశారు. శుక్రవారం మంత్రి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్‌పల్లి మండల పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యలో లంగర్‌హౌస్ టిప్పుఖాన్‌పూల్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ మహిళ పడి ఉండటాన్ని గమనించారు. కాన్వాయ్‌ను ఆపాలని ఆదేశించగా అప్పటికే కాన్వాయ్ ముందుకు వెళ్లటంతో డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుని తిరిగి వచ్చి మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆమెకు మాటలు రావని సైగలతో చెప్పడంతో నీళ్లు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించారు.