ఆంధ్రప్రదేశ్ కు మనుషులు – నేతలు కావాలి.


ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అఘమ్య గోచరంగా మారనుందా !

తల్లిదండ్రులు పేరు కన్నా కులం పేరు చెప్పుకునే వారు ఎక్కువగా వుంటున్నారు.
మార్పు కావాలి.
ఆంధ్రప్రదేశ్ లో మనుషులును ఓటర్లుగా మార్చేస్తున్న రాజకీయ కర్మాగారాల నుండి మానవత్వాన్ని కాపాడుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు .

మనుషులు లేని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతరించిపోయే ప్రమాదం వుందా ! ఎటుచూసినా ఏపిలో ఓటర్లే కనబడుతున్నారని, బిడ్డలను భాద్యత లేకుండా కంటున్న ఓటర్ల కారణంగా సామాజిక భద్రత దెబ్బతింటుందని, జన్మనిచ్చిన బిడ్డ భవిష్యత్ కోసం ఓటు హక్కును వినియోగించుకునే మనుషులు నేడు లేరని ఆయన ఆవేదన చెందారు.

ఎన్నికలలో ఎందుకు తిరుగుతున్నామో, ఎవరికి ఓటు వేయమంటున్నామో ఎవరి కోసం
ఏ భవిష్యత్ కోసం ఓటు వేయమని ప్రచారం చేస్తున్నామో ఓటు అడిగేటోడికి, ఓటు వేయించుకున్న వారికి ఇంగిత జ్ఞానం లేకపోవడం దురదృష్టం అని,ఓటర్ల నరనరాల్లోను ఒక రకమైన కుత్రిమ వైరస్ వుండే విధంగా ప్రధాన రాజకీయ కర్మాగారాలు ఎప్పటికప్పుడు వ్యూహా రచనలు చేస్తు వారి వారి రాజకీయ ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారని, ఓటర్ల రక్తంలో కరోనా ను మించిన కుత్రిమ మత్తు వైరస్ ను ప్రతి ఎన్నికలు ముందు ఎక్కిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టికి ఓటువేయటం గెలిపించటం గెలిచిన అనతి కాలంలోనే మోసపోయాం అని, ఒకడు మా మతానికి, మా కులానికి,
మా ప్రాంతానికి అంటున్నారని,
ఏ ఒక్కడైనా నా బిడ్డ భవిష్యత్ ఏమిటి,
నా రాష్ట్రం, నా దేశం ఎంత భద్రతగా వుందని, మౌలిక వసతులు, కనీస వసతులు ఎంత మేరకు అమలు జరుగుతున్నాయనే ఆలోచన చేయగలిగే ఓటరు వున్నాడా ! అని ఆయన ప్రశ్నించారు.

ఏ కులనాయకుడైన ఆ కులానికి నేను న్యాయం చేసానని బహిరంగంగా చెప్పగలిగే ఏ ఒక్క కులనాయకుడైనా నేడు వున్నాడా ! ఆ కులాలను నమ్మించి మోసగించి అసెంబ్లీ, పార్లమెంట్ లో నాయకులుగా చలామణి అవుతున్న ఏ ఒక్క నేత అయినా
నా ఛాలెంజ్ కు సమాధానం చెప్పగలిగే దమ్మున్న నేత నేడు వున్నాడా అని ఆయన విమర్శించారు.

నేడు ఏపిలో ఉద్యమాలు చేస్తున్నవారంతా మోసపోయారా ! మోసం చేసుకున్నారా అని ఆత్మ విమర్శ చేసుకోవాలని,
పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాను అన్నోడికి జె జె లు కొడుతున్నారు ఇవ్వనన్న వారికి జై జై లు కొడుతున్నారని, దీన్ని బట్టి ఓటర్లు మాత్రమే పెరుగుతున్నారని, మనుషులు కరువై పోతున్నారని, నేడు నేతలు చేసే మోసాలకు ఓటర్లు పునాది రాళ్లు గా ఉపయోగ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

నేడు నేతగా చలామణి అవుతున్న ఏ ఒక్క నేతైనా ఓటర్లు కు మద్యం పోయించకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా అక్రమ లావాదేవీలు జరపకుండా సమాజ హితంకోసం, మానవ హక్కుల భద్రత కోసం, అభివృద్ధి,
ప్రజా సంక్షేమం కోసం, ప్రకృతి వనరుల రక్షణ కోసం, మహిళా భద్రత కోసం, సమాన న్యాయం కోసం, విద్యా వైద్యం అన్ని వర్గాల వారి దరికి ఉచితంగా చేర్చటం కోసం పనిచేస్తున్న ప్రజా నేత నేడు కనుచూపు మేరలో కనబడటం లేదని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.

మనిషిగా కాకుండా ఓటరుగా బ్రతకాలనునే ప్రజానీకం వున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి లేదని, భద్రత లేదని, పచ్చిగా మోసం చేస్తున్నా ఇంకా
ఆ పార్టీల జెండాలు మోస్తున్న ఓటర్లు వున్నంత వరకు ఏపిలో ఈ విపత్కర పరిస్థితులు తప్పవని,సంపన్న వర్గాలు ముఖ్యం కాదు నా భవిష్యత్, నా బిడ్డ భద్రత, నా రాష్ట్రం అభివృద్ధి, నా దేశ భద్రత అని ఆలోచించే మనుషులు, నేతలు ఆంధ్రప్రదేశ్ కు అవసరం వుందని ఆయన తెలిపారు.

మనుషులుగా మారి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని, కాలం చెల్లిన నేటి ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రజలు సమాధి కట్టాలని, ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి ఆంధ్రులను, ఆంధ్రా స్థిర నివాస పార్టీలను మనుషులుగా మారిన ప్రజలు ప్రోత్సహించాలని,
ఇతర రాష్ట్రాలకు
ఆ రాష్ట్రాల రాజకీయ అవసరాలకు మన రాష్ట్రం నుండి తరలించుకు పోతున్న అపార ఖనిజ వనరులను,సంపదను ముఖ్యంగా గ్యాస్, క్రూడాయిల్ నిక్షేపాలను కాపాడుకోవాలని, ప్రత్యేక హోదాను విభజన హామీలను సాధించుకోవాలని అప్పుడే ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రం గా చరిత్ర పుటల్లో నిలుస్తుందని ఆయన తెలిపారు.

ప్రతి బిడ్డను మనిషిగాను, మానవత్వం గాను తీర్చి దిద్దటంలో తల్లి దండ్రుల పాత్ర కీలకంగా వుండాలని, ప్రతి మనిషి పేరు చివర తల్లి దండ్రులు హోదా కనబడాలని, కులం తోకలు కాదని, ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపటం కోసం, సంపన్న రాష్ట్రం గా తీర్చి దిద్దటం కోసం, మెరుగైన పౌర సేవలు, మెరుగైన సమాజం కోసం, ప్రకృతి వనరుల రక్షణ కోసం, మహిళా భద్రత, పసిపిల్లల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనుషులు కోసం, నేతల కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అన్వేషిస్తుందని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ఈ సభకు అర్పిసి సీనియర్ నాయకులు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,ఎవిఎల్ నరసింహారావు, వల్లి శ్రీనివాసరావు, దుడ్డె సురేష్ ,దోషి నిషాంత్మా, నేపల్లి బుజ్జి, నాగవరపు సురేష్, పేరూరి శివ, కారుమూరి శిరీష, కారుమూరి రత్నకుమారి, వర్ధనపు శరత్ కుమార్, వర్ధనపు దిలీప్ కుమార్, బలగం శ్రీనివాస్, గొల్లపూడి సాగర్, దొంగా బాలాజీ, మోర్తా ప్రభాకర్ తదితరులు పాల్గొనియున్నారు.

–మేడా శ్రీనివాస్,
అధ్యక్షులు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్

About The Author