కాంగ్రెస్ లో మళ్లీ పాదయాత్ర కలకలం


వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో జనాల మనసులు గెలుచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అది అలా ఎవరో ఒకరు కొనసాగిస్తూనే వున్నారు.
అయితే వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర పేరిట ఇదే తరహా యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ అధిష్టానం అడ్డం పడింది. దాంతో జగన్ ఢీ అంటే ఢీఅన్నారు. బయటకు వచ్చారు. పార్టీ పెట్టారు. సిఎమ్ అయ్యారు.
ఇప్పుడు తెలంగాణలో మళ్లీ అదే ఎపిసోడ్ రిపీట్ అవుతోంది. కాంగ్రెస్ లో వున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ ఈసారి చిన్నసైజు పాదయాత్ర చేపట్టారు. పూర్తి చేసారు. ఇప్పుడు దీని ముగింపు సభ విషయం వివాదంలోకి జారుకుంటోంది.
దీనికి కాంగ్రెస్ సీనియర్లు ఎవ్వరూ హాజరుకాకూడదని ఇఫ్పుడు డిసైడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది
రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదని, ఎవ్వరూ హాజరు కావద్దని కాంగ్రెస్ నేతలకు లోపాయకారీ సందేశాలు వెళ్లినట్లు బోగట్టా.అంతే కాదు,. కాంగ్రెస్ అధిష్టానం తరపున కూడా ఎవ్వరూ హాజరుకాకుండా చూడాలనే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఓటు జారిపోయినా, కార్యకర్తలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోయినా కాంగ్రెస్ నేతలకు ఎప్పటికీ జ్ఞానోదయం కాదు. వాళ్లలో వాళ్లు ఒకరి కాళ్లు మరొకరు కిందకు లాగుతూనే వుంటారు.

About The Author