చెప్పకుండా కండోమ్ తీసెయ్యడం రేప్ చేసిన నేరంతో సమానం.
లైంగిక చర్యలో ,భార్యకో , ప్రియురాలికో చెప్పకుండా కండోమ్ తీసెయ్యడం ఎంత నేరమో తెలుసా ..? రేప్ చేసిన నేరంతో సమానం.. శిక్షకూడా ఉంటుంది.. ప్రపంచంలో అనేక దేశాలు , లైంగిక చర్య మధ్యలో కండోమ్ తీసేసినా , తనతో ఉన్నమహిళకు తెలియకుండా కండోమ్ కి చిల్లులు పెట్టినా అది శిక్షార్హమైన నేరం. అది నమ్మక ద్రోహంగా పరిగణిస్తారు.జర్మనీ , కెనడా , స్విస్ , ఆస్ట్రేలియా తో సహా అనేక యూరప్ దేశాలు , కండోమ్ మోసాన్ని దారుణమైన నేరంగా పరిగణిస్తారు. ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంకూడా , కండోమ్ స్టెల్తింగ్ ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ చట్టం సిద్ధంచేసింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. అమెరికాలో ఇలాంటి బిల్లుతెచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది.తనతో లైంగిక సంబంధానికి సిద్ధపడ్డ మహిళ , కండోమ్ ఉండాలని షరతు పెడితే , మగాడు దాన్ని అతిక్రమించి మోసం చేయకూడదని , రతి మధ్యలో కండోమ్ తీసేసినా , చిల్లులు పడ్డ కండోమ్ వేసుకున్నా , ఆమె జీవితంతో ఆటలాడుకున్నట్టేనని స్విస్ కోర్టు ఇదివరకే తీర్పు చెప్పింది. ఇలాంటి చర్యలవల్ల , మహిళలకు అవాంఛిత గర్భం వచ్చే అవకాశం ఉందని , ఎయిడ్స్ , మరియు ప్రమాదకరమైన సుఖవ్యాధులు రావచ్చునన్న భయంతో , మహిళలు రతి సమయంలో కండోమ్ ఉండాలని షరతు పెట్టడం న్యాయమని కూడా చెప్పింది…