రొమాన్స్ లో భారతీయుల స్థానం ఎక్కడ..?


రొమాన్స్ లో జీవితంపై ఇప్పటికే రకరకాల సర్వేలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. నేరుగా వ్యక్తుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారా లేక ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యూలు తీసుకుంటారా అనే విషయం పక్కనపెడితే..రొమాన్స్ గురించి మాట్లాడటానికి ఇప్పుడెవరూ వెనకాడ్డం లేదు. అందుకే భారతీయుల్లో రొమాన్స్ వాంఛలపై రకరకాల సర్వేలు ఇప్పుడు బయటకొస్తున్నాయి.
రొమాన్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. అయితే రొమాన్స్ చేయడం వేరు, రొమాన్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయడం వేరు అనేది భారతీయుల వాదనగా ఉంది. రొమాన్స్ లైఫ్ ని ఎంజాయ్ చేసే విషయంలో అందరికంటే నైజీరియన్లు ముందున్నారు. తాము కేవలం సెక్స్ చేయడం కాకుండా.. దాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నామని 69శాతం మంది నైజీరియన్లు పేర్కొన్నారు. నైజీరియన్ల తర్వాత మెక్సికన్లు సెక్స్ లైఫ్ ని తాము బాగా ఎంజాయ్ చేస్తామని చెబుతున్నారు. ఇక ఈ విషయంలో భారతీయులు మూడో స్తానంలో ఉన్నారు. ఎన్నిసార్లు రొమాన్స్ చేశామనేది ముఖ్యంకాదని, ఏ రేంజ్ రొమాన్స్న్ని ఎంజాయ్ చేశామనేది ముఖ్యమనేది భారతీయులు వాదన.ఇక ఎక్కువసేపు శృంగారాన్ని అనుభవించే విషయంలో గ్రీకులు ముందు వరుసలో ఉన్నారు. గ్రీకుల్లో దాదాపు 89శాతం మంది సగటున వారంలో ఒకసారైనా రొమాన్స్ జీవితాన్ని అనుభవిస్తున్నామని చెబుతున్నారు. గ్రీకుల తర్వాత బ్రెజీలియన్స్ రెండో స్థానంలో, రష్యన్లు మూడో స్థానంలో నిలిచారు.
రొమాన్స్ లో ఆఖరు స్థానం జపాన్ వారిదే.. రొమాన్స్ జీవితాన్ని అనుభవించడంలో జపాన్ వారు పూర్తిగా వెనుకబడి ఉన్నట్టు సర్వే తేల్చింది. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జపనీయులు.. వారంలో ఒక్కసారి కూడా రొమాన్స్ లో పాల్గొనే అవకాశమే లేదని చెబుతారు. జపనీయుల్లో కేవలం 34శాతం మంది మాత్రమే తాము వారంలో కనీసం ఒకసారైనా రొమాన్స్ లో పాల్గొంటామని చెబుతున్నారు.