ఆయుధాలను పట్టుకొని.. ఆమెను రోడ్డుపై పడేసి..
గల్ఫ్ నుంచి నాలుగు రోజుల క్రితం భారత్‌కు వచ్చిన మహిళను కిడ్నాప్ చేసి, బంగారం కోసం బెదిరించి అనంతరం రోడ్డుపక్కనే పడేసిన ఘటన కేరళలోని పలక్కడ్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. అనంతరం ఆ మహిళ పోలీస్ స్టేషన్ చేరుకొని కేసు నమోదు చేయించారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గల్ఫ్‌లో సూపర్‌మార్కెట్‌లో పని చేసే బింధు నాలుగు రోజుల క్రితమే భారత్ లోని కేరళకు వచ్చారు. అనంతరం ఆమె వద్ద బంగారం ఉందో లేదో అడుగుతూ కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు దాదాపు 15 మంది ఆయుధాలను పట్టుకొని తలుపు తట్టారని, అనంతరం బింధును బలవంతంగా తీసుకెళ్లా రని ఆమె భర్త బినోయ్ చెప్పారు.ఆమెను కారులో ఎక్కించుకున్నప్పుడు నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారంతా తన వద్ద ఉన్న బంగారం ఉందేమోనన్న దిశగా ప్రశ్నలు వేశా రని చెప్పారు. కాసేపటి తర్వాత దుండగులు ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లారు. బింధు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని విషయం తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల గురించి అవసరమైన మేరకు వివరాలు లభించాయని, విచారణ చేస్తున్నామని వెల్లడించారు.