ఉప్పెనకు నితిన్ ‘చెక్’ పెడతాడా?


ఎప్పట్లానే ఈరోజు కూడా 7 సినిమాలు వస్తున్నాయి. కాకపోతే అన్నీ చిన్నవే. ఉన్నంతలో ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ ఒకే ఒక్కటి. అదే చెక్. ఈ సినిమా షో లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఉప్పెన, నాంది సినిమాలకు ఇది చెక్ పెడుతుందో లేదో చూడాలి.
ఉప్పెన సినిమా బి, సి సెంటర్లలో బాగా ఎక్కేసింది. అటు నాంది సినిమా కూడా ఉన్న తక్కువ థియేటర్లలోనే మంచి బజ్ తో నడుస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్న చెక్ సినిమా, కచ్చితంగా ఉప్పెనకు పోటీనిస్తుందని ట్రేడ్ భావిస్తోంది.
ఉప్పెన విడుదలై ఇప్పటికే 2 వారాలైంది. దానికి నెమ్మదిగా వసూళ్లు తగ్గుతున్నాయి. ఇలాంటి టైమ్ లో చెక్ క్లిక్ అయితే.. ఉప్పెన ఫైనల్ రన్ కు దగ్గరైనట్టే. అటు ఫిబ్రవరి సెంటిమెంట్ ఈ సినిమాకు గట్టిగా కలిసొస్తుందని భావిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో భీష్మతో బ్లాక్ బస్టర్ కొట్టాడు నితిన్. ఈ ఏడాది ఫిబ్రవరికి చెక్ తో వచ్చాడు.
ఇక చెక్ తో పాటు థియేటర్లలోకి మరికొన్ని సినిమాలొచ్చాయి. వీటిలో అంగుళీక, క్షణక్షణం, బాలమిత్ర, అక్షర, లాయర్ విశ్వనాథ్, 70ఎంఎం సినిమాలున్నాయి. వీటితో పాటు రేపు (27న) ఏప్రిల్ 28న ఏం జరిగింది అనే సినిమా కూడా వస్తోంది. వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమా అక్షర మాత్రమే.
చెక్ తో పాటు.. ఈ సినిమాల జాతకాలన్నీ మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

About The Author