రహస్యాలకు కేరాఫ్‌గా మారిన సరస్సు.. నాసా శాస్త్రవేత్తలే చేతులెత్తేశారు.. భారత్‌లో ఎక్కడుందంటే….


మహారాష్ట్రలోని బుల్ధన జిల్లాలో లూనార్ సరస్సు ఉంది. ఈ సరస్సు అనేక ప్రశ్నలకు నెలవు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీనిని తేల్చే పనిలో పడ్డారు. నాసా మొదలు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన పలు ఏజెన్సీలు ఈ సరస్సుపై చాలా సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఈ సరస్సు రహస్యం ఇప్పటికీ పరిష్కరించబడని పజిల్‌గానే మిగిలిపోయింది.

భూ ఉపరితలానికి అరకిలోమీటర్ లోతులో..

లూనార్ సరస్సు భూమి ఉపరితలానికి సరాసరి అర కిలోమీటర్ కంటే ఎక్కువ లోతులో ఏర్పడింది. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 70 సంవత్సరాల క్రితం కొందరు శాస్త్రవేత్తలు ఈ సరస్సు ఎలా ఏర్పడిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక ఉల్క సెకనుకు 22 కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టిందని, దాని కారణంగా ఒక బిలం ఏర్పడి అది క్రమంగా సరస్సులా మారిందని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు.

వేదాలలో లూనార్ సరస్సు ప్రస్థావన!

ఈ వాదనలు ఇలా ఉంటే.. మరో ప్రముఖ వాదన కూడా తెరపైకి వచ్చింది. అగ్నిపర్వతం పేలడం ద్వారా ఏర్పడిందని కొందరు అంటుంటే.. అదేంకాదు లూనార్ సరస్సు వేదకాలం నాడే ఏర్పడిందని ఇంకొందరు అంటున్నారు. ఆ సరస్సు ఏర్పడటానికి శ్రీమహా విష్ణువే కారణం అని చెబుతున్నారు. రుగ్వేదం, స్కందపురాణాలలో కూడా ఈ సరస్సు ప్రస్తావన ఉంది. విష్ణువు, ఓ రాక్షసుడిని సంహరించిన సందర్భంలో ఈ సరస్సు ఏర్పడిందని కొందరు వాదిస్తున్నారు. పురాతన దేవాలయాల అవవేశాలు ఈ సరస్సు పరిసరాల్లో కనిపించడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

About The Author