ఆభ్యర్థించే స్థాయి నుంచి ఆదుకోనే స్థాయికి…


అది భారత దేశ విభజన సమయం. దాదాపు రెండు కోట్ల మంది భారత్ – పాకిస్థాన్ల మధ్య సరిహద్దులు దాటారు. ఆ సందర్భంలో మత పరమైన హింస చోటుచేసుకుంది. లక్షలాది మంది శరణార్ధులుగా దీన స్థితిలో శిబిరాల్లో ఉండిపోయారు. అదే సమయంలో భారత – పాకిస్థాన్ లపై మలేరియా మహమ్మారి దాడి చేసింది.

ఆ సమయంలో భారతదేశంలో 7.5 కోట్ల మంది మలేరియా భారిన పడగా అందులో ఎనిమిది లక్షల మంది మృత్యువు భారిన పడ్డారు. ఆ సమయంలో భారత – పాకిస్థాన్ ల ఆభ్యర్థన మేరకు కెనెడా తన రెడ్ క్రాస్ ద్వారా పెన్సిలిన్‌ ఔషధాన్ని పంపించి ఆదుకున్నది. ఇది గత చరిత్ర…

★ ఇక వర్తమానంలోకి వస్తే ★
భారత – పాకిస్థాన్ లు ఒకే సారి స్వతంత్రం పొంది 73 ఏళ్ల ప్రయాణాన్ని ముగించాయి. ఈ సుదీర్ఘ కాలంలో భారత్ పలు రంగాల్లో విశేష ప్రగతిని సాధించి ప్రపంచానికి మేధావులను అందించింది.

ఒకప్పుడు మలేరియా ఆపద కాలంలో పెన్సిలిన్‌ మందును ఇవ్వాలని భారత కెనెడాను అభ్యర్థించింది. నేడు మారిన పరిస్థితుల్లో ఆ దేశం కరోనా టీకా కొరకు భారత్ ను అభ్యర్థించింది. ఇప్పటికే 20 దేశాలకు భారత్ టీకా మందును సరఫరా చేయగా అనేక దేశాలు మన వైపు చూస్తున్నాయి.

అదే మన నుంచి మతం ప్రాతిపదికన విడిపోయిన పాకిస్థాన్ అక్కడి ప్రజల అభివృద్ధి కన్న ఉగ్రవాదాన్ని ఎక్కువగా నమ్ముకున్నది. ఈ క్రమంలో భారత దేశాని నష్ట పరుస్తూ అంతకు పదింతలు తాను నష్టపోయింది.

ఒక వైపు భారత్ క్రమంగా అభ్యర్థించే స్థాయి నుంచి ప్రపంచాన్ని ఆదుకోనే స్థాయికి ఎదుగగా పాకిస్థాన్ ఇంకా యాచించే స్థాయిలోనే ఉండిపోయింది.

( కింద చిత్రంలో 1947 అక్టోబర్ 17 కెనెడా పంపించిన పెన్సిలిన్‌ మందును విమానాశ్రయంలో అందుకుంటున్న భారత తొలి ఆరోగ్య శాఖ మంత్రి రాజకుమారి అమృత్ కౌర్… ఆ పక్కనే భారత్ ఇప్పుడు వీదేశాలకు పంపిస్తున్న కరోనా టీకా మందును చూడవచ్చు )

About The Author