ఖ్యాతి గడించిన గద్వాల సంస్థానం

https://www.facebook.com/DKAruna.TG/videos/915499155877806

“తెలంగాణలో మొత్తం 14 సంస్థానాలు ఉండగా అందులో గద్వాల సంస్థానం అతి పెద్దది. 1663 ఈ సంస్థానాన్ని రాజా నల సోమనాద్రి స్థాపించగా 1949లో రాణి ఆది లక్ష్మీ దేవమ్మ పాలనతో ముగిసింది. కృష్ణ – తుంగభద్ర నదుల మధ్య వెలిసిన ఈ సంస్థానాన్ని ( నడిగడ్డ ) మొత్తం 11 మంది రాజులు, 9 మంది రాణులు పరిపాలించారు”
“జనరంజకంగా సాగిన వీరి పాలన కాలంలో సాహిత్య, కళా రంగాలు ఓ వెలుగు వెలిగాయి. ప్రతి కార్తిక మాసంలో సాహిత్య గోష్ఠులు, అష్టావధానాలు, పండితుల సత్కారం జరిగేవి. గద్వాల సంస్థానపు ఏడంకనాల రాజా దర్బార్ లో పండితులు తమ పాండిత్యాని ప్రదర్శించి సత్కారాలను పొందటం అత్యంత గౌరవంగా భావించే వారు. తిరుపతి వెంకట కవులు మొదలు అనేక మంది పండితులు ఇక్కడ సత్కారం పొందిన వారిలో ఉన్నారు”
“ఆలాగే మాఘ శుద్ధ పౌర్ణమిన తెలుగు నేల నలుమూలల నుంచి కళాకారులు గద్వాలకు వచ్చి తమ కళలను ప్రదర్శించే వారు. ఆ జాబితాలో అక్కినేని నాగేశ్వర్ రావు తో పాటు అనేక మంది ప్రముఖ కళాకారులు ఉన్నారు”
“నిజాం పరిధిలోని 14 సంస్థానాలలో స్వంత నాణేలు ముద్రించుకొని చెలామణి చేసుకొనే ఆవకాశం ఒక్క గద్వాల సంస్థానానికి మాత్రమే ఉండేది. ఈ ఒక్క దానితో ఈ సంస్థానపు గొప్పతనం ఏమిటో ఇట్టే చెప్పవచ్చు”
“వీరి పాలన కాలంలో ప్రతి ఏడాది మాఘ శుద్ధ పూర్ణిమి రోజున శ్రీ శ్రీ శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్థూ వచ్చారు. ఈ ఆనవాయితీ కొనసాగిస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి సుప్రసిద్ధ మంత్రాలయ మఠం వారు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తు వస్తున్నారు”
“నిన్న అర్ధరాత్రి రథోత్సవం నిర్వహించడంతో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పెద్ద జాతర ప్రారంభమైనది. ఈ సందర్భంగా గద్వాలలోని భారీ మట్టి కోట… ఆ కోటలోని శిల్ప నైపుణ్యాలతో కూడిన ఆలయాలు, ఇతర చారిత్రక నిర్మాణాలకు సంబంధించిన వీడియో తెలంగాణ ప్రజల కోసం…”

About The Author