ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కొవిడ్‌ టీకా…


దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండి దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని తొలి డోసు టీకాను తీసుకున్నారు.

తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.
కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న మోదీ..

భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను మోదీ తీసుకున్నారు. ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా మోదీకి సిరంజీ ద్వారా టీకా ఇచ్చారు.

About The Author