ప్రపంచ కుబేరులజాబితాలో రూ 6.09 లక్షల కోట్లతో ఎనిమిదోవ స్థానంలో ముఖేష్ అంబానీ


న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముఖేష్‌ అంబానీ 2021 హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రూ రూ 6.09 లక్షల కోట్ల సంపదతో ఎనిమిదవ స్ధానంలో నిలిచారు. గత ఏడాదితో పోల్చితే ముఖేష్‌ ఆస్తుల విలువ 24 శాతం పైగా పెరిగింది. ఇంకా ఈ జాబితాలో గౌతం అదానీ రూ 2.34 లక్షల కోట్ల సంపదతో 48వ ర్యాంక్‌లో నిలవగా రూ 1.94 లక్షల కోట్ల ఆస్తులతో శివనాడార్‌ ఆయన కుటుంబం 58వ స్ధానంలో నిలిచింది. మరోవైపు స్టీల్‌ దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ రూ 1.4 లక్షల కోట్ల సంపదతో హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో 104వ స్ధానం దక్కించుకున్నారు.

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రమైన పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ అధిపతి సైరస్‌ పూనావాలా రూ 1.35 లక్షల కోట్ల ఆస్తులతో 113వ ర్యాంక్‌ సాధించారు. భారత్‌లో ప్రస్తుతం 209 మంది బిలియనీర్లు ఉండగా వారిలో 117 మంది భారత్‌లో నివసిస్తున్నారు.
ఇక అమెరికాలో 689 మంది బిలియనీర్లు ఉన్నారు. టెస్లా చీఫ్‌ ఎలన్‌ మస్క్‌ హురున్‌ 19700 కోట్ల డాలర్ల ఆస్తులతో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు.

About The Author