రూ.2లక్షల గేమింగ్ టీవీ లాంచ్ చేసిన ఎల్జీ


ఎల్జీ మనదేశంలో సరికొత్త టీవీని లాంచ్ చేసింది. దీన్ని ప్రత్యేకంగా గేమర్ల కోసం రూపొందించారు. గేమింగ్ కోసం ఆటో లో-లాటెన్సీ మోడ్‌తో తీసుకొచ్చిన ఎల్జీ ఓఎల్ఈడీ 48సీఎక్స్ టీవీ ధర రూ.1,99,990గా ఉంది. ఈ ఓఎల్ఈడీ టీవీ‌లో వేగవంతమైన గేమ్ ప్లేతో పాటు అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. స్మార్ట్ టీవీలో ఏఎమ్ డీ ఫ్రీసింక్, ఎన్విడియా జి-సింక్ సపోర్ట్ ఉంది. ఈ 48 అంగుళాల టీవీ ఆల్ఫా 9 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆడియో కోసం ఎఐ ఎకౌస్టిక్ ట్యూనింగ్‌తో పాటు ‘హెచ్‌డిఆర్ 10 ప్రో’ సపోర్ట్‌ను అందిస్తుంది. ఎల్‌జీ పేర్కొన్నట్లు 4కే రిజల్యూషన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇందులో 48 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో ఎక్కువ ఫ్రేం రేట్, వీఆర్ఆర్ (వేరియబుల్ రిఫ్రెష్ రేట్), ఈఆర్క్, హెచ్‌డీఎంఐ 2.1 స్పెసిఫికేషన్లు ఉన్నాయి. పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ కన్సోల్స్ కూడా ఉన్నాయి. అలాగే వీఆర్ఆర్ ఫీచర్ ద్వారా మీరు కనెక్ట్ చేసిన గేమింగ్ కన్సోల్‌కు తగినట్లు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మారుతుంది. ఇందులో సెల్ప్ లిట్ పిక్సెల్స్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా సినిమాలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మంచి కలర్‌ను టీవీ అందిస్తుంది. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఎల్జీ ఇండియా వెబ్ సైట్లోకి వెళ్లి తమ ప్రాంతంలో ఇది అందుబాటులో ఉందో లేదో చూసుకోవచ్చు.

About The Author