ఇది ఇరవైఏళ్ల క్రితం జరిగిన సందర్భం.. మాకు బంధువైన మురళీగారు(పేరు మార్చాను) బాగా రిచ్ పర్సన్.. కానీ సింప్లిసిటీతో ఉండేవాడు.. తనకు డబ్బుందన్న అహంకారం ఏమాత్రం లేకుండా అందరితోనూ కలిసిపోయేవాడు.. ఒకసారి ఆయన నాకు చెప్పిన ఒక ఇష్యూ ఇప్పటికీ నా మెమొరీలో గుర్తుండిపోయింది.. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయనేది ఆయన చెప్పిన విధానం ఇప్పటికీ గుర్తుంది.. అప్పట్లోనే ఆయన హోండా కారు వాడేవారు.. ఆర్టీసీ బస్సులోనూ ప్రయాణించేవారు.. అదే క్రమంలో అవసరమైతే నడుచుకుంటూ వెళ్లిపోయేవారు..బ్రాండెడ్ దుస్తులు, వాచ్ లు , చెప్పులు లాంటి వి వాడేవారు కాదు..కారైనా..చెప్పులైనా.. ఏదైనా సరే సౌకర్యంగా ఉండాలి తప్ప బ్రాండ్ కాదు నాకు కావాల్సింది అనేవారు..
మనుషుల మనస్తత్వాలు, డబ్బున్నవారి దర్పాలు, అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించేవాడు..మా గుడివాడలో కమర్షియల్ బంధాలే ఉంటాయి వోయ్.. ఆత్మీయ బంధాలు ఉండవ్.. ఎవడైనా చచ్చిపోయినోడు కూడా బాగా డబ్బున్నోడు అయితేనే ఇంకో డబ్బున్నోడు వెళ్లి వాళ్ల కుటుంబసభ్యుల్ని పలకరిస్తారు.. అంటే శవం కూడా కాస్ట్లీది అయి ఉండాలన్నమాట..కావాలంటే ఆ చచ్చినోడి శవాన్ని గంధపు చెక్కలతో తగలెయ్యమని ఒక లక్ష డబ్బులు ఎదురి ఇచ్చిమ రీ వస్తాడు తనకెంత డబ్బుందో జనాలు చెప్పుకోవాలని..అంతేగానీ తన దగ్గర పని చేసే డ్రైవర్ కు ఒక యాబై రూపాయలు భోజనానికి కూడా ఇవ్వడు.. ఈ మనుషులు ఎప్పటికి మారతారో ఏంటో అనేవాడు.. ఒకరోజు గుడివాడ శరత్ దియేటర్ ఎదురుగా ఉండే ఆర్వవైశ్య కళ్యామణమండపంలో జరిగిన ఒక ఫంక్షన్ కి హాజరయ్యారు..మురళీగారు.. ఆ సందర్భంలో గుడివాడలో అత్యంత బడాబాబులు, డబ్బున్న బాబులంతా అక్కడ కూర్చుని ఎవరి దర్పాన్ని వాళ్లు ప్రదర్శిస్తున్నారు..ఒకాయన తాను కొన్న కొత్త కారుగురించి, రాత్రి తాను తాగిన కాస్ట్లీ బ్రాండ్ మందు గురించి, అమెరికానుంచి అల్లుడు పంపిన బ్రాండెడ్ సిగరెట్లు గురించి, ఈ మధ్యే తన కూతురుకి వచ్చిన ఆస్ట్రేలియా సంబంధం గురించి ఇలా ఎవరికి వాళ్లు తమ ఆస్తుల గురించి చెప్పకుంటున్నారు..సహజంగా గుడివాడలో ఉన్నవారికి ఇప్పటికీ ఈ అంశం బాగా తెలుసు..ఎందుకంటే ఏ ఇద్దరు డబ్బున్నోళ్లు కాసేపు ఎక్కడైనా కలిస్తే వాళ్లిద్దరి మధ్యా వాళ్ల ఆస్తులు, అమెరికాలో ఉన్న కొడుకులు, కూతుళ్ల గురించే చర్చ జరుగుతుంది..
సరే ..ఇదే సందర్భంలో ఒకాయన ..మురళీగారి చేతి వాచ్ చూసి ఏ దేశం నుంచి తెప్పించారు సర్…చాలా బాగుంది.. ఏది ఇటివ్వండి అంటూ అడిగి మరీ తీసుకున్నారు..ఆ వాచ్ ను కింద,మీద, పైన, 180డిగ్రీల్లో , వృత్తాకారంలో, లంబకోణంలో విపరీతంగా పరిశీలించి అద్భుతంగా ఉంది సర్..ఈ మధ్యే మా అల్లుడు కెనడానుంచి ఇలాంటిదే డైమండ్ వాచ్ పంపుతానన్నాడు..నేనే వద్దన్నాను అన్నాడు..
ఆయన మాటల్ని నిశితంగా పరిశీలించిన మురళీగారు.. మనసులో నవ్వుకుని పైకి మాత్రం
…………….ఫ్రెండ్ ఒకాయన జర్మనీ నుంచి వస్తూ తీసుకొచ్చారండీ. ఇదేదో టిస్కాట్ కంపెనీ అట… …….ఎంతలేదన్నా ఈ వాచ్ కనీసం పదిలక్షలు ఉంటుంది కదాండీ.. వీలైతే నాకు కూడా ఇలాంటి వాచ్ ఒకటి తెప్పించండి..నేను ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తాను …..అయ్యో అదేం భాగ్యమండీ..కావాలంటే ఈవాచ్ తీసుకోండి..నేను మరొకటి తెప్పించుకుంటాను అంటూ చేతికి వాచ్ ఇచ్చేశాడు.. …………అయితే ఎంత ఇవ్వమంటారు.. ……………… ………..మరీ పదిలక్షలు కాదుకానీ.. లక్షన్నర అయిందని మా వోడు అన్నాడు ……..అయితే లక్షన్నర నేను ఇచ్చేస్తాను..చెక్ ఇవ్వనా క్యాష్ ఇవ్వనా ……….అంత డబ్బు అవసరం లేదులే కానీ మీ దగ్గర ఉన్నంత ఇవ్వండి వెంటనే డ్రైవర్ ను పిలిచి కారులో ఉన్న సూట్ కేసు లోంచి అరవైవేలు తీసి మురళీగారి చేతిలో పెట్టాడు ఆర్యవైశ్య కల్యాణమండపం నుంచి కారులో బయలుదేరిన మురళీగారు..మున్సిపల్ పార్క్, మార్కెట్ దాటుకుంటూ మళ్లీ నెహ్రూ చౌక్ దగ్గరకు వెళ్లారు.. అక్కడ ఫుట్ పాత్ మీద వాచ్ లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి జేబులో ఉన్న అరవైవేలు తీసి అతని చేతిలో పెట్టాడు.. వంద, యాభై, ఇరవై రూపాయల కట్టలు అన్ని ఒకేసారి చూసి ఆ వాచ్ లు అమ్మే వ్యక్తి ఆశ్చర్యపోయి ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు సర్ అని అడిగాడు ఇది నీదగ్గర పొద్దున కొన్న వాచ్ ని నేను అమ్మితే వచ్చిన డబ్బయ్యా తీసుకో అన్నాడు నా దగ్గర మీరు కొన్న వాచ్ రెండువందల ఇరవై రూపాయలే కదా .. అన్నాడు అతను అవును నీ దగ్గర కొన్న ఆ టిస్కోట్ వాచ్ నా చేతిమీది అలంకరించి, హోండా కారులో ప్రయాణించి… ఆర్యవైశ్య కల్యాణమండపానికి వెళ్లేప్పటికీ దాని రేటు అంత పెరిగిపోయింది..లే అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి హోండా కారు ఎక్కి వెళ్లిపోయారు మురళీగారు.. ఈ మధ్య గుడివాడ వెళ్లి ఆయన్ని కలిసినపుడు ఆ వాచ్ సంగతిని ప్రస్తావించాను..ఆ రోజు మీ దగ్గర వాచ్ తీసుకున్న వ్యక్తి ఆ తర్వాత అది లోకల్ బ్రాండ్ అని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఏమన్నా అన్నారా సర్ అడిగాను.. ఆయన నవ్వి… ఆ వాచ్ కొన్న పెద్దాయన దాన్ని సంక్రాంతి పండగకి అమెరికా నుంచి వచ్చిన అల్లుడుకి గిఫ్ట్ గా ఇచ్చాడట….పదిలక్షలు పెట్టి కొన్నానని చెప్పాడట… అశోక్ వేములపల్లి

About The Author