మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత నేపథ్యంలో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’…
https://www.youtube.com/watch?v=HnTxGHGmUiU&feature=youtu.be&fbclid=IwAR29R8nW2kWFKvOJ4dHIRfnyEvtsaUPR1WxKeyz4yfVv-f6naDihp24sEco
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత నేపథ్యంలో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం అనేక వివాదాలతో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 18న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనుండగా, రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసి మూవీపై మరింత హైప్ తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా.. సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ కనిపించనున్నారు. రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటించారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్’ ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం తెరకెక్కింది. విజయ్ రత్నాకర్ గుత్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సలీమ్-సలైమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారని సమాచారం. ఆర్థికవేత్త నుంచి రాజకీయనాయకుడిగా మారి 2004 నుంచి 2014 వరకు యూపీఏ పక్షాన ప్రధానిగా పనిచేసిన మన్మోహన్సింగ్ బయోపిక్ చిత్రం ప్రతి ఒక్కరిని తప్పక అలరిస్తుందని టీం చెబుతుంది. అయితే ఈ చిత్రం హిందీ వర్షెన్ ట్రైలర్ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌లో ఉన్న ట్రైలర్ ఇప్పుడు టాప్ 50లో కూడా కనిపించడం లేదంటూ ఇటీవల అనుపమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి పలు వివాదాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా రానున్న రోజులలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో చూడాలి