భారతదేశ గొప్పతనం 2

భారతదేశ గొప్పతనం

ప్రతి భారతీయుడు తప్పకుండా చదవండి…

ఒక తల్లికి సంతానం 10 మంది బిడ్డలు కలిగితే
ఆ 10 మంది బిడ్డలకు తల్లి ఒకటే అవుతుంది…
ప్రాంతం మారిందని
బాష మారిందని తల్లికి పేర్లు మారవు…

అందరికి తల్లి ఒకటే “భరతమాత’…
మనం భారతీయులం భరతమాత బిడ్డలం

మనం ఏదేశానికి వెళ్లినా
” భారతీయులు ఇండియన్” అంటారేగాని
ఆంద్రీయుడు తెలంగాణీయుడు
తమిళీయుడు అనరు
అక్కడ వారికున్న సఖ్యత కూడాలేకపోవడం
ఎంతో దౌర్భాగ్యం…

ఈపేరుతో తిట్టడం ఇంకో పేరుతో పొగడటం
ఏంటసలు
ఆంధ్రాతల్లి తెలంగాణ తల్లి తమిళ తల్లి
అని పేర్లు పెట్టిమరి….

“మాతెలుగు తల్లికి మల్లెపూదండ అనినా….
జయజయహే తెలంగాణ జననీ జనకేతనం అనిన
అది ఒక అమ్మకే వర్తిస్తాయి” …

చక్కని సంపదలతో నిండాలని
పంటలను నదులపేర్లను స్మరిస్తూ
మంచి పనులతో సమాజాన్ని నిలబెట్టి
దేశం కోసం ప్రాణాలు అర్పించి
భరతమాత ఒడిలో నిదురించిన
మహానుభావులను
మనస్ఫూర్తిగా స్మరిస్తూ
తలుచుకునే ఆ స్మరణలే ఈ గీతాలు

సమాజాన్ని దేశాన్నీ అభివృద్ధి వైపుకు
నడిపించేవాడు రచయిత అవుతాడుగాని
మనుషులలో మనసులో విషబీజాలు నింపేవాడు కాదు దేశానికే చీడపురుగు అవుతాడు…

నేర్చిన అక్షరాలు
చదివిన చదువు
ఇలా బూతుపదాలను వాడటమేనా నీ సంస్కారం
బూతు ను సాహిత్యం అని అంటారా
నీ భాషలో ఐనాల స్కైబాబా గారు …

ఇలా మనుషులలో విషబీజాలు నాటి
చేసేంత హాని
మనదేశానికి పాకిస్తాన్ వాళ్లు కూడా చెయలేరేమొ…

మాతెలుగు తల్లికి మల్లెపూదండ అని చదివినవాడివి
ప్రతి విద్యార్థి బడిలో ప్రతిజ్ఞ లో
భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా
నా సహోదరులు అని ప్రతిజ్ఞ చెయలేదా..
అసలు వినలేదా…
అసలు మీకు ప్రతిజ్ఞ ఉందనికూడా తెలియదేమొలే
తెలిసివుంటే
ఇలా మూత్రం (……) ఇలాంటి పదాలు
వాడేవాడివి కాదేమొ….

చదువును చదువుల సరస్వతి అంటారు
అంతపవిత్రమైన తెలుగును అక్షరూపాన్ని ఇచ్చి రచయితను సాహిత్యం అంటూ ఈబూతులను పుస్తకావిక్షరణ చేశావ్…

రచయిత అంటే సమాజాభివృద్ధికి పాటుపడేవాడు
సమాజానికి చీడపురుగులా మారేవాడుకాదు…
రచయితంటే మాటలతో రాతలతో
యువతకు చిన్న పిల్లలకు శిక్షణ ఇచ్చి
దేశాభివృద్ధి కి పాటుపడేలా తయారుచేసేవాడు

నీ బూతు సాహిత్యాన్ని
యువతపై పిల్లలపై ఒదిలితే
మాటల్లో సంస్కారం ఉండదు
యువత నోరుతెరిస్తే బూతే
ఉంటుంది అది నీ కడుపున పుట్టిన బిడ్డకయనా ఉంటుంది
నువు రాసిన సాహిత్యం హెడ్ లైన్ పేరును కనీసం నీ తల్లికి చెప్పగలవా లేదా
నీ బిడ్డలకు చెప్పగలవా నోరు తెరచి…

అలాంటి అసభ్యకరమయిన
మాటలు మాట్లాడి ఏంసాదిద్దాం అనుకున్నావ్
ఇలాంటి మాటలతో రాష్ట్రాలలో వైరాన్ని పెంచితే
దేశానికే చీడపురుగులా మారతావ్ చరిత్రలో మిగిలిపోతావ్ దుర్మార్గుడిలా….

నేను భారతీయుడినీ
నా కులం మతం అంటే మానవత్వం సమానత్వమే
ఆంధ్రా అని తెలంగాణ అని తమిళనాడు అని
ప్రాంతాలపై రాష్ట్రాలపై ద్వేషం లేదు…
అందరిపై సమాన దృష్టె ప్రతిజ్ఞ లో మొదటిదానికి నిర్వచనం నా ఆలోచనలు…

పొరపాటు ని నిలదీసిన అడగడం నాబాధ్యత

ఐఐనాల స్కైబాబా గారు… ఇలా రాస్తే పలుకుబడి పెరుగుతుందనుకోకు
మౌనంగా ఉండటం చేతగాని తనం అనుకోకు
ఇలాంటి విషభీజాలు నాటితే ఫలితం తప్పక అనుభవిస్తారు…

ఇలాంటి చెడును ఆపే ప్రయత్నాన్ని చేయని
ప్రభుత్వాలు
నాయకులు
న్యూస్ ఛానెల్స్
ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను…
ఇలాగే ఉంటే ఇలాంటి బాబాలు ఇంకాపుట్టుకొస్తారు పుస్తకాల్ల్లొ పాఠాలు కూడా ఇవే ఉంటాయి….
చీ ఏం వ్యవస్థ మనది….

About The Author