కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీరం


కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ పై కేంద్రం ప్రకటించిన కొత్త వ్యాక్సిన్‌ ధరలు తీవ్ర దుమారం రేపగా దానిని సమర్ధిస్తూ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ ధర పెంపు కొన్ని రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది. కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ను ముందు లభించే ధర కంటే 1.5 రెట్లు అధికంగా విక్రయించాలనే అంశాన్ని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తోసిపుచ్చింది. కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ ధరను రూ. 150 గా కేంద్రానికి నిర్ణయించింది. దీని కారణం వివిధ దేశాలు వ్యాక్సిన్‌ తయారీకి ముందుగానే పెట్టుబడి సహాయం అందించడమే. ప్రస్తుతం మరిన్నీ కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ షాట్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి అవసరమని కంపెనీ పేర్కొంది.ప్రపంచ దేశాల్లో లభించే కరోనా వ్యాక్సిన్ల ధరతో పోల్చుకుంటే భారత్‌లో తక్కువగా ఉందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం తయారైన కోవిషిల్డ్‌ వ్యాక్సిన్‌లో కొంత భాగం మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయిస్తామన్నారు. ఒక్కో డోసును రూ. 600కు విక్రయిస్తామని సీరం తెలిపింది. ప్రస్తుతం కోవిడ్‌-19కు ఇతర వైద్య చికిత్సల కంటే కోవిషిల్డ్‌ ధర తక్కువగా ఉందని కంపెనీ వివరించింది. ఆస్ట్రాజెనీకా కనుగొన్న టీకా కోవిషీల్డ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా పూణే సెంటర్‌లో తయారయ్యే వ్యాక్సిన్‌ ఒక్కో డోసును ప్రైవేటు సంస్ధలకు రూ. 600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 టీకా కొత్త ధరలను ప్రకటించిన విషయం తెలిసిందే.

About The Author