రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ 2డేస్ బందు…


కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కరోనా వ్యాధి లక్షణాలు పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగిలిన కార్యాలయ సిబ్బంది అందరూ కరోనా పరీక్ష కొరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం మొత్తం శానిటేషన్ కొరకు తాత్కాలికంగా రెండు రోజులపాటు మంగళవారం బుధవారం నాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మూతపడనున్నది.

సబ్ రిజిస్టర్ ఆనంద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల యొక్క ప్రాణాలు మరియు సిబ్బంది ప్రాణాలు ముఖ్యమని వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే కరుణ పరీక్ష చేయించుకుని తిరిగి విధుల్లో చేరాలని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. పట్టణంలో ఈరోజు ఇద్దరు కరుణ వ్యాధితో చనిపోవడం పట్టణంలో భయాందోళనలకు గురి చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పై అపోహలు తొలగించి అందరు వ్యాక్సిన్ చేసుకోవాలని కోరారు. రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కొనుగోలుదారులు అమ్మకందారులు ఈ సి లు విక్రయదారులు వివిధ రకాల పనులతో వచ్చేవారు వాళ్ల పనులు వాయిదా వేసుకోవాలని తిరిగి గురువారంనాడు 29వ తేదీ తిరిగి కార్యాలు తెరవబడుతుంది అని మీడియాతో తెలియజేశారు.

About The Author