ఆల్కహాల్‌ తీసుకుంటే కరోనా రాదా.. నిజమెంత?


ఆల్కహాల్‌ తీసుకుంటే కరోనా రాదా?
ఈ విషయంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఆల్కహాల్‌ తీసుకోవడం ఎప్పటికీ ప్రమాదకరమే. ఆరోగ్య సమస్యలను రెండింతలు చేయడంలో ఆల్కహాల్‌ ముఖ్య భూమిక పోషిస్తుంది.
10 సెకండ్లు శ్వాస బిగబట్టి ఉంచగలిగితే కరోనా రానట్టేనా?
శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను బట్టి కరోనా వచ్చిందో లేదో నిర్ధారణ కాదు. కరోనా లక్షణాలున్నప్పటికీ 10 సెకండ్లు శ్వాస బిగబట్టగలిగితే వైరస్‌ లేనట్టేనని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. కేవలం ల్యాబ్‌ పరీక్షల ద్వారా మాత్రమే కరోనా ఉందో లేదో నిర్ధారణ అవుతుంది.
బూట్ల ద్వారా కరోనా వస్తుందా?
బూట్ల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమించే అవకాశం చాలా తక్కువ. కానీ చిన్నపిల్లలు ఇంట్లో నేల మీద ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి బూట్లను ఇంటి ముందే వదిలేయడం మంచిది. బూట్ల లోపల ఉండే క్రిములకు సాధ్యమయినంత దూరంగా ఉండడమే మేలు.
పసుపు తింటే కరోనా రాదా?
పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహార పదార్థాల్లో పసుపును కలిపేది అందుకే. అయితే, పసుపు ఎక్కువగా తిన్నంత మాత్రాన కరోనా రాదనడం వాస్తవం కాదు.

About The Author