నెలరోజుల తర్వాతే శృంగారం బెస్ట్…


నెలరోజుల తర్వాతే శృంగారం బెస్ట్ కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ .. శృంగార జీవితం కొనసాగించవచ్చా అనేది కొత్త దంపతులకు ఓ సందేహం . అయితే కొవిడ్ నుంచి కోలుకున్నాక .. కనీసం నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని , ఆ తర్వాత శృంగార జీవితాన్ని కంటిన్యూ చేయొచ్చని వైద్యులు చెప్తున్నారు . సంతానం కోసం ప్రయత్నిస్తుంటే ముందుగానే టీకా తీసుకోవాలని , 2 డోసులూ పూర్తయిన 15 రోజుల వరకు గర్భం దాల్చకూడదని సూచించారు .

ప్రసవం తర్వాత టీకా వేసుకోవచ్చా ? బిడ్డకు జన్మనిచ్చాక తల్లి 4 నెలల వరకు వ్యాక్సిన్ వేసుకోకూడదు . భారత్ లో గర్భిణులు , బాలింతలు , పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరగలేదు . అందుకే ప్రస్తుతం వారికి టీకా ఇవ్వట్లేదు . మరోవైపు వీర్యం , యోని స్రావాలలో వైరస్ ఉంటుందని కొన్ని అధ్యయనాలు , ఉండవని మరికొన్ని చెబుతున్నాయి . దీనిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాలి . స్వల్ప లక్షణాలు ఉన్నా సెక్స్ జోలికి పోవద్దని , వైరస్ సోకుతుందని వైద్యులు చెప్తున్నారు

210 మంది రాత్రీపగలు కష్టపడి .. కరోనాకు చెక్ పెట్టేందుకు ఫైజర్ సంస్థ ట్యాబ్లెట్ లను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే వీటి తయారీ కోసం 2020 OCT నుంచి 210 మంది శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారట . గత వారం కేజీ ట్యాబ్లెట్ చూర్ణం తయారు చేశారని . దాన్ని 3 దశల్లో వివిధ వయసులో ఉన్న వాలంటీర్లకు ( కరోనా రోగులు ) ఇస్తామని ఫైజర్ తెలిపింది . తర్వాత 145 రోజులు ఔషధ పనితీరును చూస్తారు . కాగా కోవిడ్ కు తయారైన తొలి మాత్ర ఇదే
రెమ్ డిసీవిర్ అని చెప్పి సెలైన్ వాటర్ TS : కొందరు మూర్ఖులు కాసుల కక్కుర్తి కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . కరోనా తీవ్రమై చావుబతుకుల్లో ఉన్నవారికి రెమ్ డిసిఐర్ ఇస్తుంటే దాన్ని కల్తీ చేస్తున్నారు . నిజామాబాద్ లో సాయికృష్ణమ నాయుడు అనే వైద్యుడు 5 రెమ్ డిసీవిర్ ఇంజక్షన్లు ఇస్తానని చెప్పి రూ .1.50 లక్షలు తీసుకున్నాడు . ఖాళీ వయల్స్ లో సెలైన్ వాటర్ నింపి ఇచ్చేశాడు . అవి నకిలీ అని తేలడంతో కరోనా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు .

కరోనాను ఇలా ఎదుర్కోండి కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి ఎంతో ముఖ్యం . విటమిన్ సి , బి 12 , అవసరం . నిమ్మ , దానిమ్మ , నారింజ , పైనాపిల్ లాంటి పండ్ల ద్వారా విటమిన్ సి అందుతుంది . ఇవి తింటే వైరల్ , బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది . రోజూ ఒక గుడ్డు , వారంలో రెండుసార్లు చికెన్ తినాలి . పోషకాల కోసం విచ్చలవిడిగా విటమిన్ మందులు తీసుకోవద్దు . గోరు వెచ్చని నీరు , మజ్జిగ ఎక్కువగా తాగాలి . రోజూ 30 నిమిషాలు యోగా , వ్యాయామం చేయాలి .

About The Author