భారీ స్థాయిలో రెమ్ డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ సంఖ్యలో రెమ్ డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన గీసుగొండ పోలీసులు. ఈ ముఠా నుండి 42 రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో పాటు ఒక లక్ష 69 వేల రూపాయల నగదు, ఒక కారు, ఒక ద్వీచక్రవాహనం, ఐదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.*
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.చందా విజయ్ కుమార్,ల్యాబ్ టెక్నిషన్, బోడుప్పల్ హైదరాబాదు .2.చింతం రాజేష్, ఉరుగొండ గ్రామం, దామెర మండలం, వరంగల్ రూరల్ జిల్లా,3.ముందాటి గోపాల్, మెడికల్ రిప్రజెంటేవ్, హన్మకొండ, వరంగల్ 4.గట్టు అవినాశ్, ల్యాబ్ టెక్నిషన్, ధర్మారం , వరంగల్ ,5.వావిల సురేష్,మెడికల్ షాపు, హన్మకొండ వరంగల్.
ఈ అరెస్టు కు సంబంధించి ఈస్ట్ జోన్ డి.సి.పి వెంకటలక్ష్మి వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో పాటు, అత్యధిక వ్యాధిగ్రస్తులు వ్యాధి నివారణకు రెమ్ డెసివర్ ఇంజక్షన్ల వాడకం అధికం కావడంతో కొద్ది వ్యక్తులు ముఠా ఎర్పాడి హైదరాబాదు నుండి
రెమ్ డెసివర్ ఇంజక్షన్ల ఎం.ఆర్.పి రెట్లకు కోనుగోలుచేసి వాటిని అత్యవసరం వున్న కరోనా వ్యాధిగ్రస్తులకు అధిక ధరలకు అందజేయడం జరుగుతోంది. ఇదే రీతిలో పోలీసులు అరెస్టు చేసిన నిందితులు శంషాబాద్ ప్రాంతం నుండి రెమ్ డెసివర్ ఇంజక్షన్ల కోనుగోలు చేసి వాటిని 28వేల రూపాయల చోప్పున అమ్మేందుకు సిద్దపడ్డారు. ఇందులో భాగంగా ఈ ముఠా సభ్యులు గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్రేకుంటే లోని కరోనా వ్యాధిగ్రస్తుడికి రెమ్ డెసివర్ ఇంజక్షన్లను అందజేసేందుకు నిందితులు కట్టమల్లన్న గుడి వద్ద వున్నట్లుగా సమాచారం రావడంతో పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సూచనల మేరకు గీసుగొండ పోలీసులు కట్టమల్లన్న దేవాలయం ప్రాంతంలో అనుమానస్పదంగా కారు మరియు ద్విచక్ర వాహనాలపై వున్న నిందితులు పోలీసులను చూసి తప్పించుకోని పోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు రెమ్ డెసివర్ ఇంజక్షన్ల ను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించారు.
నిందుతులను సకాలంలో అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన మామూనూర్ ఎ.సి.పి నరేశ్ కుమార్,, గీసుగొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు అబ్దుల్ రహీం, రాజు,కానిస్టేబుల్లు పవన్ కుమార్, కిషన్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.