పురుషులు రాత్రి పడుకోయే ముందు ఆవు పాలలో…వేసుకుని తాగితే…


ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవు పాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే పురుషులలో ఏర్పడే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది. ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా భాగాలపై పట్టిస్తుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి.10-20 మి.లీ ముల్లంగి ఆకుల రసంలో తగినంత పంచదార కలిపి రెండుసార్లు సేవిస్తుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి.

నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండుమూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.

నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని చూర్ణంలా చేసుకుని రోజు రెండుసార్లు సేవించడం వల్ల మూత్రపిండ, మూత్రాశయలలో రాళ్ళు కరిగిపోతాయి. ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ఉంచితే మంట, నొప్పి, పోటు త్వరగా తగ్గుతాయి.

About The Author