కరోనా వ్యాక్సీన్ పై GST ఎత్తివేత…
ఇవాళ ఉయదం ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది…. ఉదయం నుంచి వర్చువల్ విధానంలో జరుగుతున్న సమావేశంలో కోవిడ్ నియంత్రణకు కు సంబంధిన వైద్య పరికరాలతో పాటు వ్యాక్సిన్‌పై కూడా జీఎస్టీ తగ్గించేందుకు కౌన్సిల్లో ఏకాభిప్రాయం కుదిరింది. కోవిడ్ వ్యాక్సిన్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయనున్నారు. వ్యాక్సిన్ తయారీదారులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మార్పులు సూచించనున్నారు. ఇతర వైద్య పరికరాలపై కూడా జీఎస్టీ తగ్గించనున్నారు. పూర్తి వివరాలు మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించనున్నారు.