భారత్ లో మరో హైటెక్ సొరంగం మార్గం
భారతదేశంలో మరో హైటెక్ సొరంగం మార్గం ప్రజలకు అందుబాటులోకి రానున్నది.
ఈ మార్గం జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా ఖాజిగుండ్ – రాంబన్ జిల్లా బనిహాల్ మధ్య నిర్మించారు.
ఈ హైటెక్ టన్నెల్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది.
శీతల కాలంలో ఈ మార్గంలో సాగే రెండు, మూడు గంటల ప్రయాణం ఇప్పుడు కేవలం పదిహేను నిముషాల్లో ముగుస్తుంది.
రూ .2,100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సొరంగం ఏడాది పొడవునా కాశ్మీర్‌ను దేశానికి అనుసంధానించేలా చేస్తుంది.
స్వచ్ఛమైన గాలిని తీసుకురావడానికి ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో 124 జెట్ ఫ్యాన్లు, 234 సిసిటివి కెమెరాలతో పాటు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్‌ను కలగి ఉన్నది.
8.5 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ మార్గం రాబోయే కొన్ని వారాల్లో ప్రజలకు, సైనికులకు అందుబాటులోకి రానున్నది.