నాయకుడు అంటే ఇలా ఉండాలి….


బెంగుళూరుకు 500 కి.మీ దూరంలో ఉన్న #బాగల్‌కోటకు చెందిన సావిత్రి అనే మహిళ, బెంగుళూరు సౌత్ పార్లమెంటు సభ్యులు Tejasvi Surya గారిని ట్విట్టర్లో సంప్రదించారు..
నేను మీ నియోజకవర్గ ఓటరును కాననీ అయినా తాను దీనమైన పరిస్థితుల్లో ఉన్నాననీ, సహాయం చేయమనీ ప్రాధేయపడ్డారు..
ఆయన పూర్తి వివరాలతో బెంగుళూరుకు రమ్మని, తప్పక సహాయం చేస్తానని అపాయింట్‌మెంట్ ఇచ్చి కబురు పంపారు..
ఇంతవరకు బాగానే ఉన్నా లాక్‌డౌన్ నిబంధనల కారణంగా ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సమయానికి ఆమె రాలేక బెంగుళూరు శివారులోనే చిక్కుకుపోయింది..
దానితో తేజశ్వీ గారే స్వయంగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె సమస్యను ఆరాతీశారు..
తన భర్త #టాంజానియా దేశంలో చిక్కుకుపోయారనీ, ఆయనకు భారత దౌత్య అధికారులను సంప్రదించి స్వదేశం రావడం తెలియదనీ, ఆయన్ను ఆ దేశానికి తీసుకువెళ్ళిన #మధ్యవర్తి మోసం చేశాడనీ కన్నీటి పర్యంతమై మీరే సహాయం చేయాలని మొరపెట్టుకున్నది..
విషయం అవగతం చేసుకున్న యువ నాయకుడు నేరుగా విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో అక్కడి నుంచే మాట్లాడి ఆమె భర్త స్వదేశానికి రావడానికి ఏర్పాటు చేయించాడు.

About The Author