చె ద లు నివారణ చేయడం ఎలా


స్వంత ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి లేదా ఫ్లాట్ ఉన్న వారికి బాగా పరిచయం ఉండే చికాకు ‘చెదలు’
చెదలు అంటే తెల్ల ఛీమలు అని వాడుకలో అంటుంటారు కానీ అవి చీమలు కావు.
చెదపురుగులు సాంఘీకంగా (చీమల లాగా) జీవించే కీటకాలు. పని చేయటానికి. లార్వాలు పుట్టించడానికి, సైన్యం లా కాపలాకి, ఆహార పరిశోదనకీ, విడివిడిగా ఇవి పనులు కేటాయించుకుంటాయి. రాణి కీటకాలు, కూలీ కీటకాలు ఇక్కడకూడా సేమ్ టూ సేమ్.
ఇవి ఎక్కువగా చనిపోయిన వృక్ష సంభందాల పై జీవిస్తాయి. ముఖ్యంగా కలప, ఎండిన ఆకులు, మట్టి, జంతువుల పేడ వీటికి ఆహారం. సుమారు నాలుగువేల జాతుల పైగా ఉండే వీటిలో 10 శాతం మాత్రమే కట్టడాలకి, పంటలకు/అడవులకు నష్టం కలిగిస్తాయి.
..
ఇళ్లలో ఎంతో మోజు పడి, ఖర్చు పెట్టి చేయించుకున్న ఫర్నిచర్, దరవాజాలు, తలుపులు, ముఖ్యంగా ఫ్లై వుడ్ లేదా న్యూ వుడ్ తో చేసిన కప్ బొర్డ్స్ వీటికి అత్యంత ప్రియమయిన ఆహారం.
వేప లాటి చక్క ని ఇవి తినవు అని అనుకోవటం భ్రమ, మరేవి దొరకనప్పుడు, చేదుగా ఉండే వేపని కూడా వదలవు.
కార్డ్ బోర్డు, పై వుడ్, న్యూ వుడ్, పొరలు పొరలుగా ఉండే ఫ్లష్ డోర్లు, పుస్తకాలు, వాటికి మైదా అంటించి వేసే అట్టలు లాటివి వీటికి ప్రియాతి ప్రియమయిన ఆహారం , తదుపరి వీటి దాడి బట్టల మీదకి ముఖ్యంగా స్టార్చ్ వేసిన బట్టల మీదికి మల్లుతుంది. చమట తో తడిచిన కరెన్సీ నోట్లని కూడా ఇవి గుటకాయ స్వాహా చేస్తాయి.
..
చెద పురుగులు కంటే వాటి లార్వాలు చాలా రెట్లు ప్రమాదకరమయినవి. అవి పురుగులుగా మారే క్రమంలో చుట్టూ అందుబాటులో ఉండే ఆహారాన్ని తినేస్తాయి. ఎంతోకొంత తడి ఉండే వస్తువులపై ఇవి త్వరగా దాడి చేస్తాయి. బయటకి చక్కగా కనబడే పాలిషెడ్ ఫర్నిచర్ హటాత్తుగా ఒక రోజు చిన్న వత్తిడికి చొట్ట పడొచ్చు. తోలుస్తూ ఉంటే మీరు భయపడేంతగా లోపల పాడయి పోయి ఉండొచ్చు.
లక్షల విలువయిన నగిషీలు చెక్కిన ప్రధాన ద్వారం కి మీరు మంచి పనివాళ్ళ చేత చక్కటి పాలిష్ చేయించ వచ్చు. భవిషత్తు లో ఒక రోజు మీరు తాళం తిప్పినప్పుడు తాళం తో పాటు దరవాజాకి బిగించిన లాక్ కింద ఊడిపడి లోపల పెద్ద లొట్ట కనిపించవచ్చు.
..
అత్యంత ప్రమాదకరమయిన ఈ చెదలు ఎలా వ్యాపిస్తుంది? దీనిని అరికట్టటం ఎలా అనే విషయాలు తెలుకోవటం మంచిది.
..
#చెదలు_ఎలా_వ్యాపిస్తుంది ?
ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే , కొంతమంది ఇష్టంగా తినే ఉసుళ్ళు కూడా చెదలు జాతికి చెందినవే.
వీటిని ఆపటం కష్టం. అపార్మెంట్స్ లేదా/ ఇళ్ళు ల్లో మనం కరెంటు వైర్లు నడపటానికి వాడే కంసీల్ పి‌వి‌సి పైపులు చెదపురుగులకి హైవే ల వంటివి . స్వచ్చగా ఎక్కడి నుండి ఎక్కడికయినా వెళ్తాయి.
వాటర్ లీకేజి సమస్య ఉన్న చోట తడి గోడల వద్ద గోడలకి అంటుకుని సైన్యాన్ని తయారు చేసు కుంటాయి.
మనం ఇష్టపడి వేయించిన మార్బుల్/ గ్రానైట్ ఫ్లోరింగుల కింద నుండి ఇల్లంతా వ్యాపిస్తాయి. ముఖ్యంగా గోడలకి మనం అంటించే స్కర్టింగ్ నుండి వేగంగా ప్రయాణం చేస్తాయి. skirting వెనుక పూర్తి స్తాయిలో mortor (మాలు) అంటించి ఉండదు. సిమెంటు ని ఒక ఉండ లాగా ఉంచి రాయిని గోడకి ఫ్లోరింగ్ కి లంభంగా ఉండెట్టు అతికిస్తారు. పై భాగాన మూసే స్తారు. లోపల అంతా ఖాళీ నే ..
పైగా ప్రతి రోజు తుడవటం కడగటం చేసినప్పుడు మూలలవద్ద తేమ ఉండి వాటి స్తావరాలు పెరుగుతాయి. శానిటరీ పైపులు కింది సగభాగం లో మాత్రమే తడి ఉంటుంది. పైన ఉండే సగభాగం లో చదలు స్తావరాలు ఉంటాయి.
పల్లెల్లో ఎక్కువ బాగం ఒక తప్పు చేస్తుంటారు. ఇంటి బయటి పక్క పూత పని చెయ్యరు. వృధా ఖర్చు అని వీళ్ళ నమ్మకం. నిజానికి ఇంటి నిర్మాణం లో ముందు బయట పూత చెయ్యాలి. లేదంటే వర్షాకాలం లో గోడలు నీళ్ళు తాగి టెర్మైట్స్ పెరగటానికి దోహదం చేస్తాయి. పైగా అరమార్లకి మెష్ మెత్తుతారు. అవి అంగుళం మించి ఉండవు. వీటిలో తడి ఉండి పోయి అరమారలో సర్దిన పుస్తకాలు, బట్టలు చెదపురుగులకి లడ్లవుతాయి.
గోడల్లో ఉంచిన చక్క కరెంటు బోర్డు లు ఈ మద్య కాలం లో వాడక పోవటానికి కారణం చెదలే అన్న విషయం మర్చి పోవద్దు. పల్లెల్లో ఇంటికి దగ్గర్లోనే పశువులు ఉండటం వాటి పేడ నుండి, మనుష్యుల కాళ్ళకి అంటుకుని ఇంట్లోకి చేరతాయి. కానీ పల్లెల్లో చెదలు ని కాపాడే ఒక దివ్యమయిన విషయాలు రెండు ఉన్నాయి.
ఒకటి ఆవు నుండి వచ్చే పేడ/పంచకం.
రెండోది ఎండ. అవును ఎండ. రోజు మొత్తం లో ఎంతో కొంత కాలం ఇంట్లోకి ఎండ రావటం సాద్యమయితే చెదలు భాద తక్కువగా ఉంటుంది.
లేదా ? ఎర్ర చెమలు ఉన్న ప్రాంతం లో చెదలు ని ఇవి తేనేస్తాయి. కానీ చీమలు ఫ్లోరింగ్ లోని మట్టి ని లాగేసి కుప్పగా పోస్తాయి. ఇంటికి తాళం వేసి రెండు మూడు నెలల తర్వాత చూడండి. తెలుస్తుంది.
..
#పరిష్కారం??
చీమలు తవ్వుతుంటే. వైట్ సిమెంట్ (కేజీ ల లో దొరుకుతుంది. ఏ పెయింట్ షాపులో నయినా) లో కిరోసిన్ ఆయిల్ కలిపి రంధ్రాలలో ప్లాసిక్ టూత్ పిక్ తో కూరండి. కూరే ముందు ఒక సిరంజీ నీడిల్ తో రంద్రాలలో కిరసనాయిలు పిచ్చికారి చేయండి.
చెదలు నివారణ ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు ఫ్లోరింగ్ వేసే ముందు సున్నం చల్లితే మంచిది. ఇంటి నిర్మాణానికి వాడే కలప బాగా ఆరుదల కర్ర అయ్యేలా జాగర్త పడండి. ఇంటి నిర్మాణానికి చాలా ముందే (సుమారు ఆరు నెలలు) శాల్తీలు కోయించుకుని ఒక క్రమ పద్దతిలో (అడితి లో అడగండి)
ఆరబెట్టాలి. సీజనింగ్ అంటారు ఆంగ్లం లో (తిరగమాత కాదు) గోడలోకి వెళ్ళే బాగం కి ‘బోయిడెక్స్’ కెమికల్ (మార్కెట్ లో అమ్ముతారు) పూశాక తారు పెయింట్ వేయించండి. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక పెయింటింగ్ వేసే ముందు గడపల క్రింద బాగాన అడుగు/అడుగున్నర కి ఒక సన్నటి 3mm రంధ్రం చేసి ఐకన్ & బోయిడెక్స్ (ఇది 20 లీటర్లలో అమ్ముతారు.) సిరంజీ ద్వారా ఎక్కించండి. ..
చాలా స్ట్రాంగ్ వాసన ఉంటుంది.
దీనిలో ఆయిల్ బెసేడ్ మంచిది. ప్లాస్టిక్ గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో ఈ మందు వేసి కలిపి చూస్తే ఆయిల్ బెసేడ్ అవునా కాదా అర్ధం అవుతుంది.
..
ఇలాటివి ముందుగా చేపట్ట లేక పోయారు అనుకోండి. అప్పుడు ఇంటి నిర్మాణం లో ఎక్కువగా ప్లైవుడ్/న్యూ వుడ్ వాడకండి. వాడారు ఫో తరచూ గడపలని గమనిస్తు ఉండండి. ప్రారంభం అక్కడి నుండే ఉంటుంది.
మీరు ఫ్లాట్ లలో ఉంటున్నట్లు అయితే అందరూ కలిసి ఈ ట్రీట్మెంట్ చేయించ వలసి ఉంటుంది. ఎవరో ఒకరు మాత్రమే చేయిస్తే అవి మిగతా ఫ్లాట్స్ కి సోకుతాయి. తర్వాత మళ్ళీ పుట్టింటికి తిరిగి వస్తాయి.
..
ఆల్రెడీ చెదలు తినటం ప్రారంభమయితే ఉపేక్షించకుండా పూర్తిగా ఆ బాగాన్ని తొలగించండి. ప్రతి అడుగు /అడుగున్నర కి చక్క గోడకి ఆనే ఉపరితలం లో డ్రిల్లు తో రంధ్రాలు వేసి #ఐకన్ & #బోయిడెక్స్ సిరంజీ లతో ఎక్కించి తరవాత వైట్ సిమెంట్ తో రంద్రాలని పుడ్చేయండి. దీనికిప్పుడు ప్రోఫ్ఫెషనల్స్ ఉన్నారు. ఇదో పెద్ద వ్యాపారం ఇప్పుడు.
మీ ఆవరణ లో ఉన్న అన్నీ ఇండ్లకు ఒకేసారి చేయిస్తేనే ఫలితం లేదా అవన్నీ ట్రీట్మెంట్ జరగని చోటకి పరిగెడతాయి…
నిర్లక్ష్యం చేస్తే నష్టం బక్కెట్ల కొద్దీ కన్నీళ్ల లో ఉంటుంది.

About The Author