రోజుకు రూ.100 ఇన్వెస్ట్‌ చేస్తే కోట్లు వెనకేయవచ్చా?!


చేతిలో డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరికి కోటీశ్వరులు కావాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికతో అవగాహన లేకుండా ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్‌ చేసి డబ్బుల్నివృధా చేసుకుంటుంటారు.అదే ఒక ప్లాన్‌ ప్రకారం ఇన్వెస్ట్‌ చేస్తే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే సంపన్నులయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం భారీగా ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు రూ.100లెక్కన పెట్టుబడి పెడితే సరిపపోతుంది. అది ఎలా అంటారా? హైదరాబాద్‌లో నివసించే శేఖర్‌ అనే ఉద్యోగి భవిష్యత్‌ లో తన పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ పేరుమీద రోజుకు రూ.100 అంటే నెలకు రూ. 3వేలు తనకు తెలిసిన మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాడు. అలా 25 నుంచి 30ఏళ్ల పాటు డబ్బుల్ని సేవ్‌ చేశాడు. దీంతో తనపిల్లల చదువులు, పెళ్లిళ్లే కాదు రిటైర్మెంట్‌ తరువాత కూడా ఎలాంటి ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కోటీశ్వరుడయ్యారు.
ఉదాహరణకు శేఖర్‌ నెలకు రూ.3 వేలు.. 30 ఏళ్ల పాటు పొదుపుచేయగా వార్షిక రాబడి 15శాతంగా పరిగణలోకి తీసుకుంటే రూ.2.1 కోట్లు వస్తాయి.10 శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటే రూ.68 లక్షలు వస్తాయి. 12 శాతం అయితే రూ.1.05 లక్షలు పొందొచ్చు.

About The Author