దళిత,గిరిజన భూములు అక్రమిస్తే చూస్తూ ఊరుకోము..


దళిత,గిరిజన భూములు అక్రమిస్తే చూస్తూ ఊరుకోము.
ఎస్సీ ఎస్టీలను రాజకీయంగా చూడొద్దు పేదలగ సేవ చేయండి
ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షడు సాకే హరి

దళిత, గిరిజనులకు ప్రధాన జీవనాధరమైన అరకొర ప్రభుత్వ భూములు పంపిణీ చేస్తే వాటిని ధన, రాజకీయ,అంగ బలంతో ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేదిలేదని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.శుక్రవారము ఎస్సీ,ఎస్టీల భూమి,దాడులు, అన్యాయాలకు నిరసనగా కూడేరు తాహశిల్డార్ కార్యలయం ముందు ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.అనంతరం సమస్యలతోకూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ గారికిఅందచేయడంజరిగింది.ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ..మండల వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల సమస్యలు అనేకరకాలుగా ఉన్నాయని పరిస్కరించే వారు కరువైనారని వాపోయారు.కమ్మురు గ్రామ పొలంలో మాల నారాయణ స్వామి పునరావాసం కోసం సర్వే 477-2,587-3 నందు 5 ఎకరాల ప్రభుత్వ భూమి కలెక్టర్ ఇస్తే అదే గ్రామంలోని బోయ నారాయణ స్వామి ఆక్రమించుకోవాలని చూస్తుంటే అందుకు అర్ ఐ శివారెడ్డి సహాయ పడుతున్నాడన్నారు.కలగల్ల, ఉదిరిపికొండ, కొరకోడు,తిమ్మాపురం తదితర గ్రమాల్లో సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలను రాజకీయ పార్టీలకు అతీతంగా చూడాలని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తక్షణ పరిష్కారం కోసం చొరవ చూపాలన్నారు sc, St లకు బతుకు తెరువు లో బాగంగా అన్ని వర్గాల ప్రజల తోను మంచి సంబధాలు కలిగి ఉంటారని అంతమాత్రాన రాజకీయ రంగు పులిమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేయడం దాడులు, దౌర్జన్యాలకు దిగడం సరైనది కాదన్నారు.sc,st ల సంక్షేమ, అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు.సమస్యల పరిష్కారం కోసం దళిత, గిరిజనలను చైతన్యం చేయడానికి పూలే, అంబేడ్కర్ ఆలోచన విధానాలను ప్రజల్లోకి దళిత, గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నెరిమెట్ల నాగరాజు,మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఓబులేసు,sc,st విజిలెన్స్ కమిటీ మెంబర్ పోలా వీరా అప్పా జిల్లా అధ్యక్షుడు చిన్న ఆంజనేయులు సమతా సైనిక్ దల్ జిల్లా అధ్యక్షులు జవ్వాజి పనింద్రకుమర్, mrps అధికార ప్రతినిధి నరసనయన కుంట సూరి, దళిత హక్కుల సంఘం సాకే నరసింహులు,sc,st పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు సింగoపల్లి కేశవ్,msf రాష్ట్ర అధ్యకుడు మంత్రి సుదర్శన్ జేఏసీ నాయకులు చంద్రశేకర్, గడ్డం ముత్యాలు, శ్రీనివాసులు,ap ముత్యాలు, వీరా, గోవిందు తది తరులు పాల్గొన్నారు

About The Author