నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణాలు బలి…కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్

 

తిరుపతి నగరపాలక సంస్థ.కరోనా మహమ్మారి పట్ల నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణాలు బలి అవుతాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ అన్నారు.

తిరుపతి. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో కమిషనర్ గిరీష మాట్లాడుతూ గత వారం ముందు వరకు 2.5 వరకు పాజిటివ్ రేటు వుండగా ఇప్పుడు 3.5 వరకు పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని,ముఖ్యంగ ప్రజల్లో అప్రమత్తత లేకపోవడం వలనే కేసుల సంఖ్య పెరుగుతున్నదని కమీషనర్ ఆందోళన వ్యక్తం చేసారు.

ఎవరికైన కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరిక్ష చేసుకోండి,ఓకవేళ పాజిటివ్ వచ్చి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా క్వారింటినకి వెల్లాలని తెలియజేస్తూ,తిరుపతి విష్ణునివాసంలో కోవిడ్ కేర్ సెంటర్ రన్నింగ్ లోనే వున్నదని,అక్కడ కావల్సిన సదుపాయలు భోజనం,మెడిసన్ సకాలంలో అందుబాటులో వున్నట్లు ఆయన వివరించారు.

పాజిటివ్ వచ్చిన వారు బయట విపరీతంగ తిరుగుతుండడం,మాస్కూలు సరిగా ఉపయోగించడం‌లేదని, వాక్సిన్లు వేసుకోకుండా వుండడం మూలనా అదేవిధంగ వ్యాక్సిన్ వేసుకున్నాము మాకేమి కాదులే అని నిర్లక్ష్యంగ తిరగడం మూలనా తిరిగి పాజిటివ్ సంఖ్య పెరుగుతున్నదని కమీషనర్ ఆవేదనన వ్యక్తం చేసారు.తిరుపతి నగరంలోని షాపింగ్ మాల్స్,బస్టాండ్లు,దుఖాణాల్లో కోవిడ్ నిబందనలు పాటించేలా అప్రమత్తం చేయడం జరిగిందని,మాస్కు లేని వారికి జరిమాన విదిస్తున్నమని వివరించారు.తిరుపతి నగరంలో ఇప్పటి వరకు 2,08,764 వ్యాక్సిన్లు వేయడం జరిగిందని కమిషనర్ గిరీష తెలిపారు.

...50 వేలు జరిమాన

కోవిడ్ నిబందనలు సక్రమంగ పాటించకుండా నిర్లక్ష్యంగ వున్నారని తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి 50 వేల రూపాయాలు జరిమానను కమిషనర్ గిరీష విదించారు.సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్  బుధవారం తనిఖీ చేస్తూ కోవిడ్ నిబందనలు పాటించకుండా నిర్లక్ష్యంగ వున్నారని, పసిపిల్లలను,ముసలివారిని ఇబ్బడిముబ్బడిగా అనుమతిస్తూ,బౌతిక దూరం పాటించేలా ఎలాంటి ముందస్తూ చర్యలు తీసుకోనందుకు నిర్వాహకులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ప్రస్థుతానికి 50 వేలు జరిమాన విదిస్తున్నట్లు తెలియజేస్తూ భవిషత్తులో ఇలానే వుంటె తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరికలు జారిచేసారు.అదేవిధంగ శుభమస్తు షాపింగ్ మాల్ ని కూడా అధికారులతో కలిసి తనిఖిలు నిర్వహించి పలు జాగ్రత్త సూచనలు చేసారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,శానిటేషన్ సూపర్ వైజర్ చెంచయ్య,ఈస్ట్ డిఎస్పి మురళీధర్,సిఐ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author