తిరుపతి డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ రెడ్డి

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ రెడ్డి ఏకగ్రీవంగ ఎన్నుకోబడినారు.తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లలితా ప్రాంగణంలో శుక్రవారం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం  జరిగింది.ఈ సమావేశంలో చిత్తూరుజిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల పరిశీలకులుగ హాజరై డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రకియను తిరుపతి నగర పాలకసంస్థ కమీషనర్ గిరీషా సమక్షంలో జరిపించారు.

డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రకియకు 50 మంది  కార్పొరేటర్లతోబాటు ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి హాజరైనారు.

డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రకియను కలెక్టర్ ప్రారంభించగ మొదట కార్పొరేటర్ సి.కె.రేవతి 4వ వార్డు కార్పొరేటర్ భూమన అభినయ్ రెడ్డి పేరును డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించగా,కార్పొరేటర్ దూది కుమారి అభినయ్ రెడ్డి పేరును బలపరచగా,మరో కార్పొరేటర్ అన్నా సంధ్యా యాదవ్ బలపరచగా,మరో కార్పొరేటర్ పొన్నాల చంద్రా కూడా బలపరుస్తూ భూమన అభినయ్ రెడ్డికి మద్దతు ప్రకటించగా,ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ హరినారాయణన్  లాంచనంగ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటించి దృవీకరణ పత్రాన్ని అందించడం‌ జరిగింది.డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్,అదనపు కమిషనర్ హరిత,ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి పూల బోకె అందించి అభినందనలు తెలియజేసారు.*

గురువారమే భూమన అభినయ్ రెడ్డి జన్మదినం సందర్భంతోబాటు డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడంతో భూమన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి భూమన అభినయ్ రెడ్డికి బొకేలతో,సాలువాలతో,కేకులతో అభినందలు తెలియజేస్తూ లలితా ప్రాంగణంలో సందడి చేసారు.అతిపెద్ద కేకును తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా సమక్షంలో కట్ చేసి అభినయ్ రెడ్డి కి తినిపించి అభినందనలు తెలిపారు.కార్పొరేటర్లకు విప్ గా వ్యవహరించిన కార్పొరేటర్ ఎస్.కె.బాబు,ఆంజినేయులు బుద్ధ విగ్రహాన్ని అందించగా,కో.ఆప్సన్ సభ్యులు ఇమామ్ అభినయ్ రెడ్డి చేతికి రక్షా రేకను కట్టి అభినందనలు తెలియపరచగా,కార్పొరేటర్లందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. తండ్రి నుండి ఆశీర్వాదం తీసుకున్న భూమన అభినయ్ రెడ్డి తనకు కేటాయించిన చాంబర్ లో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, కమిషనర్ గిరీష , మేయర్ డాక్టర్ శిరీషా,డిప్యూటీ మేయర్ ముద్రనారాయణల సమక్షంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య డిప్యూటీ మేయర్  గా భాధ్యతలు స్వీకరించడం జరిగింది.

About The Author